Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇలాంటి పనుల వల్లే నిద్ర పట్టదు, అవేంటో తెలుసుకుని, చేయడం ఆపండి
ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా కీలకం. సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. రోజూ కంటినిండా నిద్ర పోతే సగం రోగాలు మన దరికి చేరవని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేకపోవడం, అర్ధరాత్రి వరకు కూడా నిద్ర రాకపోవడం, నాణ్యమైన నిద్ర పోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. రోజంతా ఇతర పనుల వల్ల అలసిన శరీరానికి నిద్ర మంచి విశ్రాంతిని ఇస్తుంది. ఇది శరీరాన్ని తనకు తాను రిపేర్ చేసుకునేలా చేస్తుంది.
సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పనిపై శ్రద్ధ పెట్టడం కష్టంగా ఉంటుంది. రోజంతా అలసటగా, నీరసంగా ఉంటుంది. జీవన నాణ్యత పడిపోతుంది. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు చుట్టుముడతాయి.

అందుకే కంటినిండ నిద్రపోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొన్ని పనుల వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టదు. ఆ పనులేంటో, వాటిని ఎలా దూరంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రకు ఆటంకం కలిగించే అలవాట్లు
1. ఫోన్, ట్యాబ్‌లను ఎక్కువగా వాడటం:
ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఫోన్లు వాడుతున్నారు. అయితే పడుకునే ముందు బెడ్‌పైకి చేరుకున్న తర్వాత కూడా ఫోన్, ట్యాబ్స్, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను తెగ చూసేస్తుంటారు. ఈ ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుండి వెలువడే నీలి కాంతి నిద్ర రాకుండా చేస్తుంది. అందుకే పడుకునే ముందు స్క్రీన్‌లను చూడటం మానుకోవాలి.
2. పడుకునే ముందు వ్యాయామం:
వ్యాయామం చేయడం చాలా అవసరం. అయితే పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల నిద్ర దెబ్బతింటుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేలా చూస్తాయి. దీని వల్ల నిద్ర పట్టదు. వెయిట్ ట్రైనింగ్ కు బదులు స్ట్రెచ్‌లు, యోగా సాధన చేయడం మంచిది.
3. మ్యాట్రెస్:
పడుకునే చోటు సౌకర్యవంతంగా లేకపోతే నిద్రపట్టడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతుంది. బెడ్ పై వేసుకునే పరుపు చాలా మెత్తగా ఉన్నా, గట్టిగా ఉన్నా రెండూ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి సమస్యలు వస్తాయి.
4. రాత్రి వేళ కెఫిన్ తీసుకోవడం:
కొందరు రాత్రి పడుకునే ముందు కాఫీలు, టీలు తాగుతుంటారు. దీని వల్ల నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఇందులోని కెఫిన్ మెలకువగా ఉండేలా చేస్తాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత కెఫిన్ తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర పట్టదు.
5. ఆంబియెన్స్:
నిద్రకు ఉపక్రమించే ముందు గది వాతావరణం కూడా చాలా కీలకం. పడుకునే గదిలో చీకటిగా, చల్లగా ఉంటే చక్కగా నిద్ర పడుతుంది. గదిలోకి వెలుతురు వస్తే నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది. అందుకే పడుకునే ముందు కిటికీలు, తలుపులు వేసుకుని సాధ్యమైనంత చీకటిగా ఉండేలా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications