Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రోజూ ఒక కొబ్బరి బోండం తాగితే..! అందాల్సిన అన్ని పోషకాలు అందుతాయ్..!
కొబ్బరి నీళ్లు దివ్య ఔషదం అని అంటున్నారు. ప్రతీ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయని అటు వైద్యులు, ఇటు పరిశోధకులు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఆసుపత్రిలో ఇచ్చే సైలైన్ బాటిల్‌తో సమానంగా కొబ్బరి నీళ్లను పోలుస్తున్నారు. కొబ్బరి నీళ్లు ఇన్స్‌టాంట్ ఎనర్జీని ఇస్తాయ్. రెండు వారాల పాటు ప్రతి రోజు ఒక కొబ్బరి గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే వచ్చే ఫలితాలు అంతకు ముందెన్నడూ వుండవని అంటున్నారు.
కొబ్బరినీళ్లల్లో పొటాషియం పుష్కలంగా వుంటుంది. శరీరంలో వుండే బ్లడ్ ప్రెజర్‌ను, గుండె పనితీరులు, జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఈ పోషకం కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ పొటాషియం శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. దీనిని ఆహారం ద్వారా మాత్రమే తీసుకోవాలి. కాబట్టి కొబ్బరినీళ్లను తాగమని ప్రోత్సహిస్తున్నారు.

కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులకు ప్రత్యామ్నాయంగా ఈ కొబ్బరి నీళ్లను తాగవచ్చు. బయట మార్కెట్లో లభించే చాలా పానియాల్లో కెమికల్స్ వుంటాయ్. ఈ కొబ్బరి నీళ్లల్లో అంతా సహజమైనవే వుండడం వల్ల శరీరానికి చాలా మంచిది. స్పోర్ట్స్ డ్రింకుల్లో చెక్కర శాతం కూడా అధికంగా వుంటుంది. చాలా మంది క్రీడాకారులు గ్రౌండ్‌పైకి వెళ్లినప్పుడు కొబ్బరి నీళ్లను బాటిల్‌లో పోసుకొని వెళ్తారు. ఇది ఇన్స్‌టాంట్ ఎనర్జీని ఇస్తుంది.
కొబ్బరి నీళ్లు ఎటక్ట్రోలైట్‌గా పనిచేసి నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తాయ్. కొబ్బరి నీలల్లో ఎలక్టోరైట్లు చాలా పుష్కలంగా వుంటాయ్. శరీరంలో ఏడు ఎలక్టోరైట్లు వుంటాయ్. వాటిలో 5 కొబ్బరి నీలల్లో వుంటాయ్. దీని వల్ల నడుము నొప్పి, కండరాల నొప్పి, యముకల నొప్పి దూరమౌతాయ్.
కిడ్నీలు పనితీరు బాగుంటాలంటే యూరిన్ ఉత్పత్తి కావాలి. యూరిన్‌ను ఉత్పత్తి చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు దోహదపడతాయ్. యూరిన్ శరీరంలోంచి వెళ్లినప్పుడు శరీరంలో వుండే చెడు పదార్ధాలు బయటకు వెళ్లడానికి ఆస్కారం వుంటుంది. యూరిన్ వెళ్లకపోతే శరీరంలో టాక్సిక్‌గా మారుతుంది. కిడ్నీలు శుద్ధి కాకుండా అలానే వుంటాయ్. కాబట్టి కిడ్నీ పనితీరు బాగుండాలంటే కొబ్బరి నీరును తప్పకుండా తాగాలి. అయితే రాత్రి సమయంలో మాత్రం కొబ్బరి నీళ్లను తాగకూడదు.

కొబ్బరి నీళ్లు గెండెను ఆరోగ్యంగా వుంచుతుంది. 2014లో జరిగిన పరిశోధన ప్రకారం పొటాషియం వల్ల మహిళలకు గుండెపోటు రాకుండా వుండే అవకాశం వున్నట్లు తేలింది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించడం వల్ల గుండెపోటు రాకుండా చేస్తుంది.
రోజుకు 8 గ్లాసుల నీరు తాగనిదే మన శరీరం హైడ్రేటెడ్‌గా వుండదు. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆ రోజు శరీరం మొత్తం హైడ్రేటెడ్‌గా వుంటుంది.
చాలా మంది జంక్‌ఫుడ్‌కు చాలా ఖర్చు పెడుతుంటారు. రోజూ బేకరీకి వెళ్లే వారు మనలో చాలా మందే వుంటారు. ఒకసారి బేకరీకి వెల్తే కనీసం 150 రూపాయలు ఖర్చు కావాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొబ్బరి బోండా సుమారుగా 50 రూపాయల నుంచి 60 రూపాయలు వుంది. రోజూ క్రమం తప్పకుండా పరిగడపున ఒక కొబ్బరి బోండాను తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయ్. శరీరంలో ఊహించని అద్భుత మార్పులు వస్తాయ్. కాబట్టి వీలయితే రోజుకు ఒక కొబ్బరి బోండాను తాగుదాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications