Coconut Malai: కొబ్బరి మలై.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం

వేసవిలో కాసేపు అలా బయటకు వెళ్తే ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. నీరసించి, డీలా పడిపోతుంటాం. ఎండాకాలంలో తక్షణ శక్తి కోసం కొబ్బరి నీటిని తాగుతుంటారు చాలా మంది. కొబ్బరి నీటిని తాగడం వల్ల పోషకాలు అందడంతో పాటు డీహైడ్రేషన్ కు గురికాకుండా కూడా ఉండొచ్చు.

కొబ్బరి నీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ సహా ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీళ్లల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీరు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది.

Health Benefits Of Eating Coconut Malai During Summer In Telugu

వేసవి కాలంలో ఎక్కడ చూసిన కొబ్బరి బొండాల స్టాల్స్ కనిపిస్తుంటాయి. చాలా మంది నీటిని తాగేసి అందులోని కొబ్బరిని పడేస్తుంటారు. కొబ్బరి నీళ్లల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో.. కొబ్బరిలోనూ అన్నే పోషకాలు ఉంటాయి. కొబ్బరి మలై తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి మలై ఆరోగ్య ప్రయోజనాలు:
1. వేసవి తాపాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది:
వేసవిలో కొబ్బరి నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. అలాగే ఇందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే కొబ్బరి మలైలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవి వల్ల శరీరం వేడెక్కిపోతుంది. కొబ్బరి మలై తినడం వల్ల శరీరం చల్లబడుతుంది.

2. కొవ్వును కరిగిస్తుంది:
కొబ్బరి మలైలో ఉండే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరి మలై తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల అధిక కేలరీలు తినకుండా ఆపుతుంది. ఒక కప్పు మలైలో దాదాపు 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కొబ్బరి మలాలో విటమిన్ బి ఉంటుంది. ఇది జీవక్రియను గణనీయంగా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఇది ఉపకరిస్తుంది. అదనపు కొవ్వును కరిగించడానికి ఇది సహాయం చేస్తుంది.

3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
కొబ్బరి మలైలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. ఇది శరీర వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొబ్బరి మలైలో ఉండే మాంగనీస్ ఎముకలు, బంధన కణజాలాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు, నరాల కణాల సరైన పనితీరుకు దోహదం చేస్తుంది.

Health Benefits Of Eating Coconut Malai During Summer In Telugu

4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
కొబ్బరి మలై చెడు కొలెస్ట్రాన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొబ్బరి మలైను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది:
కొబ్బరి మలైలో జీర్ణక్రియను సాఫీగా చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ప్రేగు ఆరోగ్యంగా ఉంటుంది. తద్వార జీర్ణ రుగ్మతలు తగ్గుతాయి. కొబ్బరి మలైలో ఉండే ఫైబర్ కంటెంట్ సరైన ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

కొబ్బరి మలై గట్ బ్యాక్టీరియాను బలపరుస్తుంది. మంటతో పోరాడటంలో సహాయపడుతుంది. కొబ్బరి మలైలో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఈ, డీ, ఏ, కే సహా ఇతర పోషకాలు ఉంటాయి.

ఒక కప్పు కొబ్బరి మలైలో ఉండే పోషకాలు:
* కార్బొహైడ్రేట్లు - 10 గ్రాములు
* ఫైబర్ - 7 గ్రామలు
* కొవ్వు - 27 గ్రాములు
* చక్కెర - 5 గ్రాములు
* ప్రోటీన్ - 3 గ్రాములు
* పొటాషియం
* జింక్
* సెలీనియం
* ఐరన్
* ఫాస్పరస్

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, April 24, 2023, 12:01 [IST]
Desktop Bottom Promotion