Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Mangoes For Kids: వేసవిలో పిల్లలు చలాకీగా ఉండాలంటే ఇదొక్కటి తినిపించండి చాలు
మామిడి పండ్లను ఫలరాజు అంటారు. పండ్లలో రారాజుగా దానికి పేరు. మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్లు వచ్చేస్తాయి. నోరూరించే మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాల్సిందే.
మరి పిల్లలకు మామిడి పండ్లు తినిపించొచ్చా.. ఎంత వయస్సు ఉన్న వారికి మామిడి పండ్లు ఇవ్వొచ్చు.. మామిడి పండ్లు తినిపిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లు పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా?
మామిడి పండ్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇందులోని విటమిన్లు, మినర్లు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడతాయి. మామిడిలో సహజ సిద్ధమైన చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి పిల్లలకు రోజంతా శక్తిని అందిస్తాయి.
ఏ వయస్సు పిల్లలకు మామిడి పండ్లు తినిపించొచ్చు?
పిల్లలతో మామిడి పండ్లు తినిపించడానికి 8 నుండి 10 నెలల సమయం మంచిది. 10 నెలలు దాటిన పిల్లలు ఆహారాన్ని మింగడం నేర్చుకుంటారు. అలాంటి వారికి మామిడి గుజ్జు ఇవ్వడం వల్ల ప్రమాదం లేదు. కొందరు తల్లిదండ్రులు 6 నెలల వయస్సులోనే మామిడి పండ్లు తినిపిస్తారు. అయితే వైద్యుల సూచన తర్వాతే ఇలా చేయడం మంచిది.
మామిడి ఆరోగ్య ప్రయోజనాలు:
1. మెదడు అభివృద్ధి ఉపయోగపడుతుంది:
మామిడిలో ఉండే గ్లూటామిక్ యాసిడ్ మెదడు అభివృద్ధికి చాలా అవసరం. అదనంగా విటమిన్ బి6, మెరుగైన జ్ఞాపకశక్తిని, మెదడు పని తీరును ప్రోత్సహిస్తుంది.
2. రక్తహీనత ప్రమాదాన్ని నివారిస్తుంది:
ఒక్కో మామిడిలో దాదాపు 0.5mg ఐరన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. ఇలా మామిడి పండు పరోక్షంగా రక్తహీనతను నివారిస్తుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మానవ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి కంటెంట్ చాలా అవసరం.
4. బరువు పెరగడంలో సహాయపడుతుంది:
మామిడి పండ్లలో చాలా తక్కువ స్థాయిలోనే కొవ్వు ఉంటుంది. కానీ ఇందులో హెల్తీ కేలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల శరీర బువు పెరగడానికి సహాయపడుతుంది.
5. వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉంచుతుంది:
వేసవిలో పిల్లలు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. డీహైడ్రేషన్ కు గురైన పిల్లలు అలసట, కల్లు తిరిగినట్లు ఫీలవుతారు. మామిడి పండ్లు తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. దీని వల్ల అలసట దరిచేరదు.

6. చర్మ ఆరోగ్యానికి మంచిది:
విటమిన్ ఏ కంటెంట్ కంటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చర్మాన్ని పోషణతో పాటు కాంతివంతంగా మారుస్తుంది. మామిడి పండు గుజ్జును చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమ పొందుతుంది.
7. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మామిడి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మామిడిలో జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్ లను అందిస్తుంది. ఇది ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య దరిచేరదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications