Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తినే ఆహారాలు - తగిన వ్యాయామాలు!

చాలామంది తక్కువగా తింటూ అధిక వర్కవుట్లు చేస్తే బరువు తగ్గిపోతామనుకుంటారు. కాని ఇది సరికాదు. మనం కనుక 4 లేదా 5 గంటలపాటు ఏమీ తినకుండా వుంటే శరీరం వెంటనే అలారం బటన్ నొక్కేస్తుంది. దీనిని మనం ఆకలి పుట్టేస్తోందని భావిస్తాం. మీరు డైట్ లో వుంటారు కాని మీ శరీరం అందుకంగీకరించదు. శరీరం తన లోపలి కొవ్వులు ఎనర్జీ కొరకు ఖర్చు చేయకుండా, కండరాలనుండి ప్రొటీన్లను తీసుకుని కొవ్వులను అత్యవసరం కొరకు వుంచేస్తుంది.
ఈ ఆకలి పుట్టించిన సమయంలో వెంటనే మీరు తినేస్తే, తిన్న ఆహారమంతా నేరుగా కొవ్వుగా మారటం జరుగుతుంది. కనుక మీరు ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిపాటి ఆహారం మాత్రమే తీసుకుంటుండాలి. ఆహారం అంటే ఆఫీస్ కేంటీన్లో లభించే భోజనంగా భావించకండి. ఆహారమంటే యాపిల్ లాంటి ఒక పండుకావచ్చు లేదా ఒక మిల్క్ షేక్ కావచ్చు. మనలో చాలామంది కడుపు నిండా తింటే గాని పని చేయలేమని లేకుంటే శక్తి క్షీణించి బలహీనమవుతామని భావిస్తారు. సాధారణ ఆరోగ్యం వున్న వ్యక్తి విషయంలో ఇది నిజం కాదు. ఏవైనా వ్యాయామాలు చేయాలంటే ఉదయంపూట కడుపు ఖాళీగా వున్నపుడే చేయాలి.
మీరు గనుక బలహీనం అయి లేదా రక్తపోటు తగ్గితే అపుడు ఒక చిన్న మొత్తంలో ప్రొటీనులు అధికంగాను కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోండి. ఎగ్ వైట్ లేదా మొలకెత్తిన గింజలు ఇందుకు గాను సూచించదగినవి. మధ్యాహ్నం పూట పూర్తిగా భోజనం చేసి వర్కవుట్లు మొదలెడితే ప్రయోజనం చేకూరదు. చాలామంది హడావుడిగా జిమ్ లకు వెళ్ళి వర్కవుట్లు చేస్తుంటారు. సరిగా వీటిని చేయకపోతే సమయం వృధా చేసినట్లే.
సాధారణంగా మరో తప్పు అందరూ చేసేది. బాగా అలసిన వ్యాయామం చేసిన తర్వాత వెంటనే ఎంతో కొంత ఆహారాన్ని తినేస్తారు. వర్కవుట్లు చేసిన గంట తర్వాత తినాలి. లేకుంటే ఆ ఆహారం మీరు కోల్పోయిన ఎనర్జీకి ఖర్చుపెట్టబడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications