Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
సీజనల్ ఫ్రూట్స్ తింటే గుండె పదిలం...!

సాధారణంగా నలభై ఏళ్ళ వయస్సు దాటిన ప్రతి ఒక్కరిలో గుండె పనితీరుకు సంబంధించిన ఆలోచన, ఆందోళన తప్పక ఉంటుంది. అందుకే 40 నుంచి 50 వరకు ఏటా ఒకసారి, 50 దాటాక ఏడాదికి రెండు సార్లు లిపిడ్ ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకొని, వైద్యలు సలహా తీసుకుంటే మీ గుండె నిక్షేపంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, గుండె ఆరోగ్యానికి ఏ రకమైన ఆహారాలు, జీవన విధానం ఆచరించాలనేది పరిశీలించండి.
ప్రతిరోజ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయాలు తినండి. డైనింగ్ టేబుల్ పై ఉప్పు, కారం లేకుండా చూసుకోండి. తీనే సమయంలో అధనంగా ఉప్పు వేసుకునే అలవాటు మానండి. ఈ సీజన్‌లో యాపిల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి యాపిల్ చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఒక కప్పు యాపిల్ ముక్కల్లో 3.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
నారింజపండ్ల రసంలో బి9 విటమిన్ ఉంటుంది. ఇది గుండెజబ్బులకు దారితీసే హోమోసిస్టైన్‌ను తగ్గిస్తుంది.
పచ్చిబఠానీల్లో బి2, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు రక్తనాళాలను పదిలంగా కాపాడతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెజబ్బులు వచ్చిపడతాయి.
ద్రాక్షపండ్లు గుండెజబ్బులను దూరంగా ఉంచుతాయి. ద్రాక్ష వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫ్లావాన్స్, ఆంతోసైనిన్ వంటి ఎన్నో మంచి లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి. ద్రాక్షను గోరువెచ్చని నీళ్లలో లేదా ఉప్పు నీటిలో క డిగి తీసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది.
వేరుశనగపప్పులు గుండెకు ఎంతో మేలు చేస్తాయట. రోజూ కాసిని వేరుశనగ పప్పులు, బాదంపప్పు, వాల్‌నట్స్ తీసుకుంటే గుండె నిక్షేపంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
వీటితో పాటు బీన్స్ కూర తరచుగా తనడం వల్ల కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications