Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఒత్తిడి కంట్రోల్ చేసుకొంటే గుండె సురక్షితం...!

ఒత్తిడితో గుండెపై ఎలా ప్రభావం చూపిస్తుందంటే? మనలో ఒత్తిడి పెరిగినప్పుడు అడ్రినాలిన్, కార్టిజాల్ వంటి హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. మనం ఒత్తిడితో ఉద్వేగం అనుభూతించడానికి ఆ హార్మోనులే కారణం. ఈ హార్మోన్ల కారణంగా నరాల్లోని రసాయనాల మార్పులకు దోహదం చేస్తాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అధికం కావడం, చక్కెర పాళ్లు పెరిగిపోవడం జరుగుతాయి. ఒక్కోసారి బాగా ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ఆ ప్రభావంలో ఉండి తానెంత తింటున్నాడో తెలియనంతగా తినేస్తుంటాడు. దానికి తోడు వయాయామం చేయడు. పైగా ఒత్తిడిని అధిగమించేందుకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం చేస్తుంటాడు. ఒత్తిడి కారణంగా క్రమబద్దమైన నిద్రలోపిస్తుంది. ఇవన్నీ గుండెపోటును ప్రేరేపించే అంశాలే..
ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోవడం వల్ల గుండెపై తీవ్రమైన భారం పడి గుండెపోటు వస్తుంది. ఒకేసారి తీవ్రమైన ఒత్తిడి పడినప్పుడు రక్తనాళాల్లోని లోపలి గోడలు దెబ్బతింటాయి. సాధారణంగా నునుపుగా ఉన్న గోడలపై రక్త ప్రవాహానికి, దెబ్బతిన్న గోడలపై ఉన్న రక్త ప్రవాహానికి మార్పు ఉంటుంది. ఇలా దబ్బతిన్న గోడలపై రక్తం ఆగి ఆగి, అవాంతరాలతో ప్రవహించడం వల్ల కొన్ని చోట్ల రక్తం గడ్డ కట్టి రక్తపు గడ్డలు పేరుకునే ఆస్కారం ఉంది. ఆ ర్తపు గడ్డలు ప్రవాహానికి మరింత అవరోధం కల్పిస్తుండటంతో క్లా్స్ మరింత ఎక్కువై ఒక్కోసారి గుండెకు అందాల్సిన రక్తం అసలు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు.
ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం ఎలా చూద్దాం: తీవ్రమైన ఒత్తిడిని అధిగమించడానికి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు మార్గాలను అవలంబిస్తుంటారు. వారికి ఉపయుక్తమయ్యే ప్రక్రియను ఎంచుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో ఒకసారి నిపుణులైన వైద్యలను సంప్రదించడం మంచిది. ఇక ఎవరైనా ఆచరించగల సాధారణ అంశాలకు వస్తే ...
1. మితంగా తినడం.. మితంగా తాగడం: సమతల ఆహారం మితంగా ఎక్కువసార్లు తీసుకోవడం, ఆల్కహాల్ వంటి అలవాట్లలో పరిమితిని తప్పనిసరిగా పాటించడం అవసరం.
2. పొగతాగే అలవాటు మానడం: ఉన్న ఒత్తిడి వల్ల కలిగే దుష్పరిమాణాలకు అదనంగా సిగరెట్ లోని ఉత్ర్పేరకమైన నికోటిన్ వల్ల కలిగించే ఉద్వేగాలు తోడయి పరిస్తితిని మరింత దిగజారేలా చేసే అవకాశం ఉంది.
3. వ్యాయామం: ప్రతిరోజూ చేసే ఏరోబిక్ వ్యాయామాలు మనలో ఎండార్ఫిన్స్ ను విడుదలయ్యేలా చేస్తాయి. అవి ఒత్తిడి వల్ల దుష్పరిణాలను తగ్గిస్తాయి. సానుకూల దృక్పథానికి దోహదం చేస్తాయి.
4. ఒత్తిడికి కారణమ్యే అంశాలను నివారించడం: కొందరు చాలా తక్కువ సమయంలోనే నెరవేర్చాల్సిన లక్ష్యాలను ఎక్కువగా నిర్ణయించుకుంటారు. ఒక్కోసారి ఇది తీవ్రమైన ఒత్తిడిని కలిగించచ్చు.
5. సానుకూల దృక్పథం: ప్రతి విషయంలోనూ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండటం వల్ల అసలు సమస్య, దాని వల్ల గుండెపపైన దుష్ప్రభావం.. ఈరెండు సమస్యలనూ ఏకకాలంలో పరిష్కరించవచ్చు.
6. ఇక యోగా, ధ్యానం అన్నవి ఒత్తిడిని ఎదుక్కోడానికి సాధారణ మార్గాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలపై కాస్త అవగాహన పెంచుకోవడం వల్ల గుండెపోటు వంటి రిస్క్లను తగ్గించుకోవచ్చని గుర్తుంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











