Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బైపాస్ సర్జరీ అంటే ఏమిటి ?
బైపాస్ సర్జరీ అంటే ఏమిటి ?
మామూలుగా నిత్యం మనం బైపాస్ అనే మాట వింటూ ఉంటాం. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉంటే సాధారణంగా బైపాస్ రోడ్డు వెంబడి వెళతాం. అదే విధంగా ఇక్కడ కూడా సన్నపడిన ఈ రక్తనాళాల బదులు వేరే రక్తనాళాలను ఉపయోగించి ఈ చికిత్స చేస్తారు. కాబట్టి దీనికి బైపాస్ సర్జరీ అని పేరు. ఈ బైపాస్ సర్జరీతో మొదటగా శరీరంలోని ఆరోగ్యవంతమైన రక్తనాళాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు కాలినుంచి ఒక రక్తనాళం తీసి దానిని గుండె నుంచి వచ్చే ప్రధాన రక్తనాళానికి అతికిస్తారు. దీని యొక్క ఇంకో చివరను కొలెస్ట్రాల్ చేరడం వలన లోపలి వ్యాసం తగ్గి రోగపూరితమైన రక్తనాళానికి అతుకు పెడతారు.

అలా అతికించే రక్తనాళాలు రెండు రకాలు. అవి
1. కాలినుండి గుండెకు రక్తాన్ని తీసుకొని వెళ్ళే ఒక సిరను ఉపయోగిస్తారు. దీనికి వీనస్ గ్రాఫ్ట్ అని పేరు.
2. ఛాతీ లోపల ఉండే ఇంటర్నల్ మెమొరీ ఆర్టరీని లేదా ఛాతినుంచి రేడియల్ ఆర్టరీని ఉపయోగిస్తారు. దీనికి ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అని పేరు. అయితే, ఈ రక్తనాళాలను తీసి ప్రధాన రక్తనాళానికి, రోగపూరితమైన రక్తనాళానికి అంటించడం వలన ఏ ఇతర దుష్ప్రభావాలు ఉండవు.
ఈ బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు?
ఈ విషయం తెలుసుకునేముందు మనం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అతి ప్రధానమైన మూడు రక్తనాళాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి
1. కుడి కరోనరీ ఆర్టరీ లేదా ధమని
2. లెఫ్ట్ మెయిన్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ
3. లెఫ్ట్ సర్ కాంప్లెక్స్.
అక్కడ గుండెలో కుడి, ఎడమ వైపున వచ్చే ప్రధాన కరోనరీ ఆర్టరీలు ఎడమవైపు వచ్చే ఆర్టరీ తిరిగి రెండుగా విభజన చెందుతుందన్నమాట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications