For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది?

బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది?

By Staff
|

 What Is Bye-pass Surgery!
1. రోగ లక్షణాలు అధికంగా ఉండి అంటే కేవలం కొద్దిపాటి పనిచేసినా, కొంచెం ఎక్కువగా భుజించినా, విశ్రాంతి తీసుకొన్నా, శారీరక శ్రమ తీసుకున్నా గుండెలో నొప్పి, ఆయాసం కలిగి మందులతో ఉపయోగంలేనపుడు
2. ఎడమ కరోనరీ, ఆర్టరీ దాదాపుగా పూర్తిగా మూసుకుపోయి రక్తం సరఫరా సక్రమంగా లేనపుడు
3. రక్తాన్ని గుండెకు సరఫరా చేసే రక్తనాళాలలో ఒకటి కంటే ఎక్కువ వాటిలో రోగ లక్షణాలుండి గుండె పని సామర్ధ్యం తగ్గిఉన్నపుడు తదితర సందర్భాలలో ఈ బైపాస్ సర్జరీ చేస్తారు.

అయితే ఈ బైపాస్ సర్జరీ అన్నది మామూలు ఆపరేషన్ కాదు. ఇది ఒక మేజర్ ఆపరేషన్, ఈ ఆపరేషన్ కు కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ ఆపరేషన్ ను చేసే సమయంలో ఆపరేషన్ చేసే వ్యక్తికి జనరల్ ఎనస్తీషియా ఇస్తారు. ఈ బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండెను స్తంభింపచేయడం అంటే కొట్టుకోవడం ఆపివేస్తారు. అయితే ఈ సమయంలో పంప్ ఆక్సిజనేటర్ ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుండె, ఊపిరితిత్తుల పని ఈ యంత్రం చేస్తుందన్నమాట. తర్వాత కాలినుంచి లేదా ఛాతీ నుంచి రక్తనాళాన్ని తీసి దీని ఒక చివరను ప్రధాన రక్తనాళం అయోర్టాకు మరొక చివరను రోగపూరితమైన రక్తనాళానికి అంటిస్తారు.

ఆ తర్వాత యధావిధిగా గుండె కొట్టుకొనేట్లు చేస్తారు. అయితే వేగంగా మారుతున్న వైద్య రంగం కారణంగా గత కొద్ది సంవత్సరాలుగా ఈ హార్ట్ లంగ్ మెషిన్ అవసరం లేకుండా కూడా బైపాస్ సర్జరీని చేస్తున్నారు. ఈ పద్ధతిలో గుండె రక్తాన్ని ప్రసారం చేస్తూ పనిచేస్తున్నపుడు కొట్టుకునే గుండెమీద ఉన్న రక్తనాళాలకు బైపాస్ సర్జరీ చేస్తారు. ఈ పద్ధతిలనే ఆఫ్ పంప్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అంటారు. ఈ పద్ధతి వల్ల రోగికి రక్తం అధికంగా వ్యర్ధం కావడం, దుష్పరిణామాలు ఎదుర్కోవడం వంటివి ఆపరేషన్ తరువాత చాలా తక్కువగా ఉంటాయి.

ఈ ఆపరేషన్ చేసిన తర్వాత రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలిస్తారు. అక్కడ నిరంతరం వైద్య పర్యవేక్షణలో వీరిని గమనిస్తారు. వీరి గుండె కొట్టుకొనే రేటు, బ్లడ్ ప్రెషర్ తదితర వివరాలను మోనిటర్ మీద 12 నుంచి 24 గంటలపాటు గమనిస్తారు. రోగి స్వచ్ఛందంగా ఆక్సిజన్ ను తీసుకోగలడని ఫిజీషియన్ కు నమ్మకం ఏర్పడే వరకు ఆక్సిజన్ బ్రీతింగ్ ట్యూబ్ లను అక్కడే ఉంచుతారు. ఆపరేషన్ అయిన తర్వాత రోగి యొక్క పరిస్ధితిని బట్టి 3 నుండి 5 రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ గా వైద్యుని దగ్గరకు చెకప్ కు వెళుతూ ఆయన సూచించిన జాగ్రత్తలను, ఆహార నియమాలను పాటిస్తూ ఉండాలి.

English summary

What Is Bye-pass Surgery! and when it required | బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది?

Generally, we hear the word bye pass surgery. Bye pass means when the traffic on the road is more, we take another route and that is called bye pass. In the same manner when the blood vessels get thickned and when the blood can not flow properly, we use some other blood vessels and do bye pass surgery and pump the blood to the heart.
Desktop Bottom Promotion