Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
Improve Heart Health: రోజూ ఇలా చేస్తే గుండె జబ్బులు రమ్మన్నా రావు, అవేంటంటే..
ఈమధ్య కాలంలో గుండె జబ్బులు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని కబలిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గుండె పోటు వచ్చి చనిపోతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. అసలు ఎందుకు గుండె పోటు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. డ్యాన్స్ చేస్తున్న వారు, ఇంట్లో కూర్చున్నవారు, నిద్రపోతున్న వారు గుండెపోటు వచ్చిన చనిపోతున్నట్లు రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ మహమ్మారి గుండెపోటు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో గుండె పోటు వస్తే ఏం చేయాలన్నదానికంటే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం చాలా కీలకం. నిపుణుల ప్రకారం రోజూ ఎలాంటి పనులు చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చురుకుగా ఉండాలి
వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం. శారీరక శ్రమ లేని ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్న వాళ్లు తప్పనిసరిగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

2. స్మోకింగ్ మానేయాలి
స్మోకింగ్ అలవాటు ఉంటే దానిని క్రమంగా మానేయాలి. ఉన్నపళంగా మానేయడం కష్టం అనుకునే వారు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. స్మోకింగ్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

3. ఆరోగ్యకరమైన బరువు
ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయాలి. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఊబకాయంతో కొలెస్ట్రాల్ పెరగడం, గుండె రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు మూసుకుపోతాయి. అందుకే ఆరోగ్యకరమైన బరువు నిర్వహించాలి.

4. ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యానికి ఆహారమే కీలకం. తిండిని మనం నియంత్రించుకోగలిగితే చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా ఆహారం చాలా ముఖ్యం. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే తాజా కూరగాయులు, పండ్లు, చేపలు, గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

5. చాక్లెట్లు మంచివే
చాక్లెట్లు, రెడ్ వైన్ గుండె ఆరోగ్యానికి మంచివే. అయితే వాటిని మితంగా మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైన్, కోకో చాక్లెట్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.

6. అతిగా తినొద్దు
అతి సర్వత్రా వర్జయేత్.. ఇది పెద్దలు చెప్పిన మాట. అంటే దేనినీ అతిగా తీసుకోవద్దు, తినొద్దు, చేయవద్దు అని. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇది అతికినట్టుగా సరిపోతుంది. అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజులో ఒక పూట ఎక్కువగా తిని, మిగిలిన సమయాల్లో అతి తక్కువగా తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

7. ఒత్తిడికి గురికావొద్దు
పనిలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబ సమస్యల్లో అయినా ఒత్తిడిని అనుభవించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన ఏదైనా పనిని చేయాలని చెబుతున్నారు. ఒత్తిడి వల్ల గుండె కొట్టుకునే వేగం విపరీతమైన హెచ్చుతగ్గులకు గురవుతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.



Click it and Unblock the Notifications