Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
How To Do CPR: సీపీఆర్ అంటే ఏంటి? గుండెపోటుకు గురైన వ్యక్తికి CPR చేస్తే ఉపయోగం ఉంటుందా?
అయితే గుండెపోటు వచ్చినప్పుడు దగ్గర ఉన్న వారు వెంటనే స్పందించి కార్డియోపల్మనరీ రీససిటేషన్(CPR) చేస్తే ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు, ఆగిపోయిన వారికి వె
కొన్ని రోజులుగా గుండెపోటు కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎంతో మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్ చేస్తూ, ఏదో పనిలో మునిగి ఉన్నప్పుడు, పెళ్లి బరాత్ చేస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

అయితే గుండెపోటు వచ్చినప్పుడు దగ్గర ఉన్న వారు వెంటనే స్పందించి కార్డియోపల్మనరీ రీససిటేషన్(CPR) చేస్తే ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు, ఆగిపోయిన వారికి వెంటనే పంప్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
గుండెకు పంపింగ్ చేస్తూ, అదే సమయంలో ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకునేలా చేసేందుకు సీపీఆర్ పనికొస్తుంది.

సీపీఆర్ ఎలాంటి వారికి అవసరం?
కార్డియాక్ అరెస్టు అయిన వారందరికీ సీపీఆర్ తప్పకుండా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రెండు సందర్భాల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది.
- గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది. గుండె కొట్టుకోకపోవడం వల్ల రక్త సరఫరా సాఫీగా సాగదు. ఇలాంటి సమయంలో సీపీఆర్(కార్డియోపల్మనరీ రీససిటేషన్) చేస్తే ఫలితం ఉంటుంది. అలాంటి వారిని బతికించే అవకాశాలు చాలా ఎక్కువ.
- గుండె వేగంగా కొట్టుకుంటుంది. మామూలు పరిస్థితిలో గుండె 50 నుండి 80 సార్లు కొట్టుకుంటుంది. ఈ సమయంలో మాత్రం గుండె 200 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. విపరీత వేగంతో గుండె కొట్టుకోవడం వల్ల పనితీరు దెబ్బతిని ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో సీపీఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- గట్టిగా అరుస్తూ పిలిచి లేపే ప్రయత్నం చేయాలి.
- అంబులెన్స్ కు సమాచారం అందించాలి.
- శ్వాస ఆడుతుందో లేదో తనిఖీ చేయాలి.
- గుండెపోటుకు గురైన వ్యక్తిని వీపుపై పడుకోబెట్టాలి.
- వ్యక్తి ఛాతీపై చేతులను ఉంచాలి. ఛాతీకి మధ్యలో ఒక చేతి మడమను ఉంచాలి. తర్వాత అదే చేతిపై మరో చేతిని ఉంచి బరువు పెట్టాలి.
- రెండు చేతులతో ఛాతీని బలంగా ప్రెస్ చేయాలి. సెకనుకు రెండుసార్లు కనీసం 20 సెకన్ల పాటు ప్రెస్ చేస్తుండాలి.
- తర్వాత నోటి ద్వారా శ్వాసను అందించడానికి ప్రయత్నించాలి. నోటి గదవను పైకి లేపి నేరుగా ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాస అందించాలి.
- ఇదే ప్రక్రియను శ్వాస ఆడేవరకు, గుండెకొట్టుకునే వరకు చేస్తూ ఉండాలి.
- పిల్లలకు చేసే సీపీఆర్ కూడా పెద్దలకు చేసే మాదిరిగానే ఉంటుంది.
- 8 ఏళ్ల పిల్లలు అయితే రెండు చేతులతో, చిన్న పిల్లలైతే ఒక చేతితో ఛాతీపై ప్రెస్ చేయాలి.
- మరీ బలంగా ఛాతీని ప్రెస్ చేయకూడదు.
- ఛాతీని ప్రెస్ చేస్తూ మధ్యలో రెస్క్యూ శ్వాస అందించాలి.
- ఛాతీపై 30 సార్లు నొక్కి ఆ తర్వాత రెండు సార్లు నోటి ద్వారా శ్వాస అందించాలి.
- గుండె కొట్టుకునే వరకు ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి.
- రెండు వేళ్లను ఛాతీపై ఉంచి సీపీఆర్ చేయాలి.
- ఎక్కువ బలం ప్రయోగించకూడదు. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు.
- సెకనుకు రెండు సార్లు ఛాతీని ప్రెస్ చేయాలి.
- నోటి ద్వారా శ్వాస అందించాలి.
- శ్వాస ఆడే వరకు, గుండె కొట్టుకునే వరకు ఈ ప్రక్రియనను పునరావృతం చేయాలి.
- గుండె పైభాగంలో ఉండే స్టెర్నమ్ అనే ఎముక వద్ద ప్రెస్ చేయాలి.
- గుండె కొట్టుకునేందుకు ప్రయత్నించాలి.
- వ్యక్తిని బట్టి ఛాతీపై ఒత్తిడి అందించాలి. పెద్దవారికి ఒకలా, పిల్లలకు ఒకలా ప్రెస్ చేయాలి.
- సీపీఆర్ లో శిక్షణ తీసుకున్న వారు అది అందిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- నోటి ద్వారా శ్వాస అందించడం చేస్తూ ఉండాలి.

సీపీఆర్ ఎలా చేయాలి?
పెద్ద వారికి:
పిల్లలకు:
శిశువులకు:




Click it and Unblock the Notifications