Latest Updates
-
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి -
ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి కోడి పులావ్.. స్పైసీగా ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్.!
వర్కవుట్స్ ఇంట్లో చేస్తే బెటరా జిమ్ కు వెళ్లి చేస్తే మంచిదా..?
ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిట్ నెస్ పై దృష్టి పెడతున్నారు. తమకు వీలున్న సమయం చూసుకుంటూ వర్కవుట్స్ చేస్తున్నారు. జిమ్ కు వెళ్లే సమయం ఉన్నవాళ్లు జిమ్ కు వెళ్తుండగా.. కుదరక, ఇష్టం లేక మరికొంత మంది ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉండి వర్కవుట్స్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయా లేక జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తే మంచిదా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో మేం ఇప్పుడు తెలుసుకుందాం

జిమ్ లో ఫిట్ నెస్ ట్రైనర్లు ఉండడం.. కసరత్తులు ఎలా చేయాలో చెప్పడం వల్ల తక్కువ సమయంలోనే చాలా మంచి ఇంప్రూవ్ మెంట్ ను సాధించవచ్చని చాలా మంది అనుకుంటారు. అలాగే అక్కడ అనేక రకాల పరికరాలు కూడా ఉంటాయి. అలా తాము కండలు పెంచడానికి అయితే ఓ పరికరం, పొట్ట తగ్గించడం కోసం అయితే మరో పరికరంతో కసరత్తులు చేయొచ్చు. దీనికోసం కూడా చాలా మంది జిమ్ లో వర్కౌట్లు చేసేందుకే మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
1. పరికరాల అందుబాటు:
జిమ్‌కు వెళ్లడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి అక్కడ అనేక పరికరాలు ఉండడం. వాటిని ఎవరైనా సరే త్వరగా సులభంగా ఉపయోగించవచ్చు. బరువులు ఎత్తాలన్నా, కార్డియో మెషీన్‌లు, ట్రెడ్‌మిల్, ఎలిప్టికల్, స్టెయిర్‌క్లైంబర్, స్టెయిర్ స్టెప్పర్, స్టేషనరీ బైక్, రోయింగ్ మెషీన్ వంటి వాటిని వాడుకోవచ్చు.
2. సౌలభ్యం:
ఇంట్లో వర్కౌట్ చేయడం వల్ల చాలా సౌకర్యంగా అనిపిస్తుంటుంది. ఇంట్లోనే ఉంటూ కావాల్సినప్పుడల్లా వ్యాయామం చేసుకోవచ్చు. బిజీ షెడ్యూల్ ఉన్నవారికి, జిమ్‌కి వెళ్లేందుకు వీలు కాని వారికి ఇది మంచిదనిపిస్తుంటుంది. జిమ్ కు వెళ్లి వచ్చేందుకు చేసే ప్రయాణ సమయం, అలాగే అక్కడ పరికరాల కోసం వేచి చూసే సమయంలోనే ఇంట్లో జిమ్ చేసుకోవచ్చని చాలా మంది భావిస్తుంటారు.
3. మోటివేషన్:
జిమ్‌కి వెళ్లడం అలవాటు అయితే రోజూ వెళ్లాలనిపిస్తుంది. అక్కడ ఉన్న వారిని చూస్తూ మరింత ఇన్ స్పైర్ అవుతూ... ఎక్కువ కసరత్తులు చేయొచ్చు. అలాగే జిమ్‌లో వ్యాయామం చేయడం తప్ప మరో పని ఉండదు. ఇంటి పనులు, కుటుంబ సభ్యులు, పిల్లలు మీకు అంతరాయం కల్గించలేరు.
4. వ్యక్తిగత శిక్షణ:
అనేక జిమ్‌లు పర్సనల్ ట్రైనర్ సేవలను అందిస్తాయి. ఇది కొత్తగా వర్కవుట్ చేయడానికి లేదా వారి ఫిట్‌నెస్‌ను మరో లెవెల్ కు తీసుకెళ్లాలని చూస్తున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అవసరాలు, లక్ష్యాలకు అనుకూలంగా వ్యాయామ ప్రణాళికను అభివృద్ధి చేయడంలో వ్యక్తిగత శిక్షకుడు సాయం చేసే వీలుంటుంది.
5. జనాల్లో కలవడం:
జిమ్‌కి వెళ్లడం వల్ల కొత్త కొత్త వాళ్లను కలవొచ్చు. మీకూ చాలా కొత్త విషయాలు నేర్చుకునే వీలు దొరుకుతుంది. మీరు గ్రూప్ ఫిట్‌నెస్ క్లాస్ తీసుకున్నా లేదా ఇతర జిమ్‌లకు వెళ్లే వారితో చాట్ చేస్తున్నా, వ్యాయామ శాలలో పని చేస్తున్న వారితో మాట్లాడుతున్నా మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
6. వెరైటీ:
రోజూ ఒకేలాగా కసరత్తులు చేయడం చాలా మందిలో నిరాసక్తతను కలుగజేస్తుంది. జిమ్ కు వెళ్లడం వల్ల మీకు నచ్చిన, వీలున్న వెరైటీ పద్ధతుల్లో వ్యాయామం చేసుకోవచ్చు. ఇది మీకు చాలా మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది.
ఇంట్లో వర్కౌట్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే అవి జిమ్ అందించే అదే స్థాయిలో ప్రయోజనాలను అందించలేదు. జిమ్ అంతగా అక్కర్లేదు అనే వాళ్లకు హోమ్ జిమ్ ఓకే కానీ.. ఫిట్ నెస్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్లకు జిమ్ యే కరెక్ట్ అని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications