Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? నిప్పులాంటి నిజం బయటపెట్టిన డాక్టర్!
ఊబకాయం.. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న తీవ్రమైన సమస్య. ఇది కేవలం మన ఆకృతికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని పాడుచేసే ఓ నిశ్శబ్ద శత్రువు. ఊబకాయం వల్ల కొందరికి అీయితే రోజువారీ పనులను చేసుకోవడం కూడా భారంగా మారుతుంది, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే బరువు తగ్గడం అత్యవసరం. అయితే బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో మార్గాలను అనుసరిస్తుంటారు. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన నమ్మకం వేడి నీళ్లు తాగడం. రోజూ వేడి నీళ్లు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని, సులభంగా బరువు తగ్గవచ్చని చాలామంది భావిస్తారు. పాత్రలకు అంటుకున్న జిడ్డును వేడినీళ్లు ఎలాగైతే శుభ్రం చేస్తాయో, మన శరీరంలోని కొవ్వును కూడా అలాగే కరిగిస్తాయని అనుకుంటారు.
ఇందులో నిజమెంత?
ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ అరుణ్ కుమార్ ఈ అపోహను తొలగిస్తూ అసలు నిజాన్ని తన యూట్యూట్ ఛానెల్ లో ఓ వీడియో ద్వారా స్పష్టంగా వివరించారు. ఊబకాయం అంటే చర్మం కింద పేరుకుపోయిన కొవ్వు. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఏవి అవసరానికి మించి తీసుకున్నా శరీరం వాటిని శక్తి రూపంలో కొవ్వుగా మార్చి దాచుకుంటుంది. ఇది మన శరీరంలోని ఒక శక్తి నిధి లాంటిది అని ఆయన తెలిపారు.

మరి ఈ కొవ్వును కరిగించడం ఎలా?
డాక్టర్ అరుణ్ కుమార్ ప్రకారం దాచుకున్న కొవ్వును కరిగించడానికి దాన్ని ఖర్చు పెట్టడం ఒక్కటే మార్గం. వేడినీళ్లు తాగడం వల్ల అది మాయం కాదు. మన శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ కేలరీలు ఆహారం ద్వారా అందించి, వ్యాయామం ద్వారా ఎక్కువ కేలరీలను ఖర్చు చేసినప్పుడు ఒక శక్తి లోటు ఏర్పడుతుంది. ఆ లోటును భర్తీ చేయడానికి శరీరం తన శక్తి నిధి అయిన కొవ్వును కరిగించి వాడుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడే మనం బరువు తగ్గుతాం.
చివరిగా చెప్పేదేంటంటే
బరువు తగ్గాలనే మీ ప్రయాణంలో వేడి నీళ్లు తాగడం మంచిదే, అది జీవక్రియను స్వల్పంగా మెరుగుపరచవచ్చు. కానీ అది నేరుగా కొవ్వును కరిగించదనేది శాస్త్రీయ సత్యం. ఊబకాయాన్ని జయించాలంటే అద్భుతాలు, అడ్డదారులు లేవు. సరైన ఆహార నియంత్రణ,క్రమం తప్పని వ్యాయామం,పిండి పదార్థాలను తగ్గించడం. ఈ మూడు సూత్రాలను పాటిస్తేనే శరీరంలోని కొవ్వు శక్తిగా మారి కరిగిపోతుంది. కాబట్టి, అశాస్త్రీయమైన నమ్మకాలను పక్కనపెట్టి సరైన జీవనశైలిని అలవర్చుకుంటేనే ఆరోగ్యకరమైన,నాజూకైన శరీరం మీ సొంతమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications