Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
Weight Loss Tips: బరువు తగ్గడానికి రోజుకు ఎన్ని చపాతీలు తినాలి?
భారతీయులు ఎక్కువగా తినే ఆహారాల్లో వరి అన్నం తర్వాతి స్థానం చపాతీదే. బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంది చెప్పే సలహా అన్నం తినడం మానేసి చపాతీ తినమని అంటారు. మధ్యాహ్నం అన్నం, రాత్రి వేళ ఒకటీ రెండూ చపాతీ తినాలన్నది చాలా మంది సూచన.
చపాతీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఎక్కువ సేపు కడుపు నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు. అసలు బరువు తగ్గడానికి రోజూ ఎన్ని చపాతీలు తినాలి, ఎప్పుడు తినాలి, చపాతీలు ఎలా తింటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చపాతీలోని పోషక విలువలు:
* ఒక చపాతీలో (27గ్రా) ఎన్ని పోషకాలు ఉంటాయంటే
* కొవ్వు - 2.5గ్రా
* ఉప్పు - 80 మి.గ్రా
* పొటాషియం - 53 మి.గ్రా
* కొలెస్ట్రాల్ - 0 మి.గ్రా
* కార్బోహైడ్రేట్లు - 12 గ్రా
* ప్రోటీన్ - 2.1 గ్రా
* ఫైబర్ - 2.6 గ్రా
సాధారణంగా చపాతీలో(నెయ్యి లేదా నూనె కలపని) అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే అందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. చపాతీలో విటమిన్ బి1, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఇ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా చపాతీ ద్వారా లభిస్తాయి.
బరువు తగ్గడానికి రోజూ ఎన్ని చపాతీలు తినాలి?
ఒక చిన్న చపాతీలో దాదాపు 81 కేలరీలు ఉంటాయి. మధ్యాహ్నం పూట రెండు చపాతీలు తినేసి, 300 కేలరీలకు తగిన ఇతర ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు తినొచ్చు. చపాతీలలోనే కాకుండా కూరగాయలు, పండ్లలో కొంత మొత్తం పిండి పదార్థాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
రోజూ తినగలిగే గోధుమ చపాతీల సంఖ్య రోజూ ఎన్ని కేలరీలు తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రోజుకు నాలుగు చపాతీలు తినాలని అంటారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు మధ్యాహ్న భోజనంలో చపాతీలు తీసుకుంటే ఇతర ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. 350 కేలరీలకు మించకుండా చపాతీలు, కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటున్నట్లు అనిపిస్తే చపాతీ సంఖ్యను తగ్గించుకోవాలి.
బరువు తగ్గడానికి ఏ రోటీ మంచిది?
ఎక్కువ మంది గోధుమ చపాతీలను ఎక్కువగా తింటుంటారు. జొన్న, రాగి, మిల్లెట్, సజ్జలు, వోట్స్ తో చేసిన చపాతీలు కూడా కొందరు తింటుంటారు. మిగతా వాటితో పోలిస్తే సజ్జలతో చేసిన చపాతీలు చాలా పోషకమైనవని చెబుతారు. సజ్జల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే సజ్జల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications