Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ వయస్సు ప్రకారం రోజులో ఎన్ని గంటలు,ఏ టైంకి పడుకోవాలో తెలుసా?
మనుషులకైనా, జంతువులకైనా నిద్ర చాలా ముఖ్యం. తగినంత నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అని అందరికీ తెలుసు. కానీ ఈ బిజీ లైఫ్ లో చాలా మంది సరిపడినంత నిద్రలేక అనేక ఆరోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు క్రమపద్దతిలో లేని షిఫ్ట్ లలో పనిచేయడం, ఫోన్ ని ఎక్కువగా వాడటం,అనేత ఇతర కారణల వల్ల నిద్ర లేక అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.
75% మంది టీనేజర్ లకు తగినంత నిద్ర ఉండట్లేదని ఓ అంచనా. అయితే రిఫ్రెష్‌గా ఉండటానికి, పగటిపూట మంచిగా పనిచేయండానికి ఏ సమయంలో పడుకోవాలి? మీకు ఎంత నిద్ర అవసరం,ఏ వయస్సు వాళ్లు ఎన్ని గంటలు పడుకోవడం మంచిది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం.

అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం ఏ వయస్సు వారికి సగటున ఎంత నిద్ర ఉండాలంటే
నవజాత శిశువులు(0-3 నెలలు): రోజుకు సగటున 14 నుండి 17 గంటల నిద్ర ఉండాలి
శిశువులు (4-11 నెలలు): రోజుకు సగటున 12 నుండి 15 గంటల నిద్ర ఉండాలి.
పసిపిల్లలు (12- 35 నెలలు): సగటున 11 నుండి 14 గంటల నిద్ర ఉండాలి
ప్రీస్కూలర్స్ (3- 5 సంవత్సరాలు): రోజుకు సగటున 10 నుండి 13 గంటల పాటు నిద్ర ఉండాలి.
పాఠశాల వయస్సు పిల్లలు (6- 13 సంవత్సరాలు): రోజుకు సగటున 9 నుండి 11 గంటల నిద్ర ఉండాలి.
టీనేజర్స్ (14- 17): రోజుకు సగటున ఎనిమిది నుండి 10 గంటల నిద్ర అవసరం.
యువకులు (18- 25 సంవత్సరాల వయస్సు): రోజుకు సగటున 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి.
పెద్దలు (26- 64 ఏళ్ల వరకు): రోజుకు సగటున 7 నుండి 9 గంటలు నిద్ర ఉండాలి.
వృద్ధులు (65, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు): రోజుకు సగటున ఏడు నుండి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.
ఎన్ని గంటలకు పడుకోవాలి
ఏ టైంలో పడుకోవాలి అనేదానికి ఫస్ట్ మీరు ఎప్పుడు నిద్ర లేవాలి అని నిర్ణయించుకోవాలి. ఒకవేళ మీరు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య నిద్ర లేవాల్సి ఉంటే..
పాఠశాల వయస్సు పిల్లలు.. రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య పడుకోవాలి.
యువకులు.. రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్య పడుకోవడానికి ప్రయత్నించాలి.
పెద్దలు..రాత్రి 10 నుండి 11 గంటల మధ్య నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
నిద్రపోయే ముందు ఇవి చేయకూడదు
మంచంపై పడుకున్న తర్వాత మెదడును ఉత్తేజపరిచే చర్యలను వీలైనంత వరకు పరిమితం చేయండి. నిద్రపోయే ముందు టీవీ చూడటం లేదా వ్యాయామం చేయడం వంటి అతిగా ఉత్తేజపరిచే కార్యకలాపాలను చేయకపోవడం ఉత్తమం. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు వీలైనంత దూరంగా ఉండాలి. స్క్రీన్ నుండి కృత్రిమ కాంతి మీ నిద్ర సమయాన్ని మార్చగలదు, నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications