Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
స్పైసీ ఫుడ్స్ తెగ తినేస్తున్నారా? ఈ సమస్యల గురించి తెలుసుకోండి, అలాగే..?
వంటల్లో సుగంధ ద్రవ్యాల వాడకం చాలా సాధారణం. అవి వంటకు రుచి, వాసన, రంగును అందిస్తాయి. అవి మన ఇంద్రియాలకు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వంటల్లో మిరపకాయలు, మిరియాల వాడకం ఎక్కువగానే ఉంటుంది.
కొందరు స్పైసీ ఫుడ్స్ చాలా ఇష్టపడతారు. కొందరేమో స్పైసీ కాకుండా సాధారణంగా ఉండేవి తింటుంటారు. అయితే నోరు మండేలా కారంగా ఉండే వంటకాలు తింటే కొందరికి పొట్ట చాలా అసౌకర్యంగా ఉంటుంది. అసలు స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాసిడ్ రిఫ్లక్స్:
స్పైసీ ఫుడ్స్ తింటే కడుపులో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది కడుపు లైనింగ్ లో చికాకు కలిగిస్తుంది. ఇలా అవడం వల్ల కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఉబ్బరం, విపరీతమైన నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
2. తీవ్రమైన గ్యాస్ట్రిటిస్:
కొంత మందిలో కడుపులో పుండ్లు ఏర్పడుతుంటాయి. వీటి వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ట్రిక్ శ్లేష్మం వాపు కారణంగా పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. ఇది పొట్టను లైన్ చేసే సన్నని పొరపై ఏర్పడతాయి. తీవ్రమైన గ్యాస్ట్రిటిస్ ఉంటే మాత్రం వారిలో వికారం, వాంతులు, తలనొప్పి, మలంలో రక్తం, వాంతిలో రక్తం వస్తుంది.
3. అతిసారం:
స్పైసీ ఫుడ్స్ తిన్న తర్వాత బాత్రూమ్ కు పరుగెడుతుంటారు కొంత మంది. స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపు కలవరపెడుతుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలకు దారితీస్తుంది. దీని వల్ల బలహీనంగా అయిపోతారు. అలసట, నిస్సత్తువ ఆవహిస్తాయి.
అల్సర్‌కు స్పైసీ ఫుడ్స్ కారణం కాదు, కానీ..:
స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అల్సర్, రిఫ్లక్స్ రావు. అయితే అప్పటికే ఉన్న అల్సర్ ను ఇవి మరింతగా పెంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్పైసీ ఫుడ్ డయేరియాకు కారణం అవుతుంది. పేగులను చికాకు పెడుతుంది. స్పైసీ ఫుడ్స్ రుచి మొగ్గల సున్నితత్వాన్ని కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి స్పైసీ ఫుడ్స్ తినడం మంచిదేనా?
మిరపకాయలు, మిరియాలు వంటి మసాలాలు బరువు తగ్గడంలో సహాయ పడతాయని పలు అధ్యయనాలు తేల్చాయి. మిరపకాయలో క్యాప్సైసిన్ అనే భాగం ఉంటుంది. పెప్పర్ లో పైపెరిన్ ఉంటుంది. ఇవి శరీర జీవక్రియను మెరుగుపరచడంలో, కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ సమాచారం ప్రకారం, అధిక పరిమాణంలో స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. మసాలా ఆహారంలో క్యాప్సైసిన్ కొవ్వును కరిగిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. అయితే బరువు తగ్గడానికి స్పైసీ ఫుడ్స్ మాత్రమే తింటే ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











