Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కోయకుండానే పుచ్చకాయ తియ్యగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, సింపుల్ టెక్నిక్!
ఎండాకాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ తినాలనుకునేది, తినేది ఏదైనా ఉందంటే అది పుచ్చకాయ మాత్రమే. ఇది మార్కెట్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే సామాన్యులకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం మన దేశంలో నకిలీ సామ్రాజ్యం నడుస్తోంది. ప్రతీదాన్ని నకిలీ చేసేస్తున్నారు. తినే ఆహరం నుంచి తాగే నీటి వరకు ప్రతీది నకిలీమయం అవుతుంది. దీంతో ఏది మంచిది ఏది చెడ్డది అనేది మనుషులు తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.
సాధారణంగా పుచ్చకాయలో 95% పైగా నీరు ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన నీటిని అందించడానికి సహాయపడుతుంది. ఎండాకాలంలో, ఈ పుచ్చకాయలను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి శాతం అనేది తగ్గిపోకుండా ఉంటుంది. తద్వారా, వడదెబ్బ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. పుచ్చకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. కానీ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాటి పండిన స్థితిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే, పుచ్చకాయను కట్ చేయకముందే అది పండిందా లేదా అని తెలుసుకోవడం సులభం. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పుచ్చకాయ పండిందా లేదా అని తెలుసుకోవడానికి పద్ధతులు:
కాడ భాగం పరిశీలించండి: పుచ్చకాయను తీసుకునే ముందు, దాని కాడ భాగాన్ని ఒకసారి చూడాలి. ఆ ప్రదేశంలో బాగా మాడిపోయి ఉండి, చిన్న చిన్న షుగర్ స్పాట్స్ కనిపిస్తే అది పండినదని అర్థం. పూర్తిగా పండని పుచ్చకాయలో ఈ స్పాట్స్ పెద్దగా ఉండవు. అందుకే మీరెప్పుడైనా పుచ్చకాయ కొనుక్కునే ముందు వాటి కాడలను పరిశీలించి కొనుక్కోవడం మేలు.
రంగు పరిశీలన: పుచ్చకాయ పూర్తిగా పండింది అంటే అది ఒకే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుచ్చకాయపై ఎలాంటి మచ్చలు లేకుండా ఒకే రంగులో ఉండాలి. పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉన్న పుచ్చకాయలు ఇంకా పండలేదు అని అర్ధం. రంగు పాలిపోయి ఉంటే మాత్రం ఆ పుచ్చకాయను కొనకపోవడమే మంచిది.
బరువు తెలుసుకోండి: పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల బాగా పండిన పుచ్చకాయ బరువు ఎక్కువగా ఉంటుంది. దానిని పట్టుకుని, బరువు ఎక్కువగా ఉంటే, అది పండినదని అర్ధం చేసుకోవచ్చు.
టాప్ పద్ధతిని ఉపయోగించండి: పుచ్చకాయపై తడిమి, శబ్దాన్ని వినండి. బాగా పండిన పుచ్చకాయపై తడిమితే, లోతుగా శబ్దం వినిపిస్తుంది. మరింత పండిన పుచ్చకాయ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ శబ్దం మామూలుగా వస్తే మాత్రం అది ఇంకా పండలేదు అని అర్ధం చేసుకోవాలి.
గీతలు మరియు మచ్చలు: పుచ్చకాయలో పచ్చ రంగు గీతలు మరియు చిన్న చిన్న మచ్చలు కనిపిస్తే, అది పండినదని అర్థం. కానీ పెద్ద మచ్చలు, గీతలు ఉంటే, అది మాగిపోయింది అని చెప్పవచ్చు.
పుచ్చకాయ సైజు: చిన్న సైజులో ఉండే పుచ్చకాయలు బాగా పండిన పుచ్చకాయలు. ఈ పుచ్చకాయలు షుగర్ స్పాట్స్‌తో ఉంటాయి, అంతేకాకుండా, బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించి, పుచ్చకాయను కట్ చేయకుండానే అది పండిందా లేదా అని తెలుసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications