Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డిప్రెషనా..? ఐతే ఈ చిట్కాలు పాటించండి..!
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. ఇది మానసిక వ్యాధి అన్న విషయం మనకు తెలిసిందే. మానసిక వ్యాధుల గురించి, మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది ఈ మధ్యనే తెలుసుకోవడం ప్రారభించారు. ఒకప్పుడు పేషంట్లు లేక ఖాలీగా వున్న సైకాలజీ సెంటర్లు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా నిండిపోయాయంటే ఆశ్చర్యానికి గురికావసిందే. కరోనా తరువాత ఇలాంటి మానసిక సమస్యలు చాలా పెరిగిపోయాయ్. డిప్రెషణ్ లక్షణాలు ఎలా వుంటాయ్, డిప్రెషన్‌ను తట్టుకోవాలంటే ఏమి చేయాలి, డిప్రెషన్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రముఖ వైద్యలు ఇచ్చిన సూచనలను మీకు అందిస్తున్నాం.
డిప్రెషన్ తగ్గాలంటే ఇవి పాటించాలి :
ఉదయాన్నే నిద్రలేవడం
రోజును ఆహ్లాదకంగా ప్రారంభించాలి. డిప్రెషన్ పోవడానికి ఇది మొదటి చిట్కా. ఉదయం కనీసం 6 గంటలకు నిద్రలేని ఫ్రెష్ అయిన తరువాత కొద్దిగా వ్యాయామం చేసుకోవాలి. తప్పుకుండా టిఫిన్ చేయాలి. తమకు ఏదైనా బాధలు, కష్టాలు వుంటే ఇతరులతో పంచుకోవాలి.
మంచి డైట్
డిప్రెషన్ దూరం కావాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డిప్రెషన్ విపరీతంగా వున్నప్పుడు భోజనం చేయాలని అనిపించదు. నచ్చిన వంటకం ముందు పెట్టినా తినకుండా అలాగే వుంటారు. అలా చేయకుండా పోషకాలు మెండుగా వున్న ఆహారాన్ని, ముఖ్యంగా కూరగాయలు, పళ్లను ఎక్కువగా తినాలి. వీటి నుంచి కావలసిన్ని వైటమిన్లు అందుతాయ్.
మద్యం, పొగ అలవాటుకు స్వస్తి
డిప్రెషన్‌కు గురైన వారిలో పొగ, మద్యం తాగే అలవాటు ఎక్కువగా వున్నవారు వాటిని ఆపివేయాలి. వీటితో పాటు ఏ మత్త పదార్థాల వల్ల కూడా తమ సమస్యలు పరిష్కారం కావని డిప్రెషన్‌కు గురైన వారు భావించాలి.

ఆత్మహత్య ఆలోచన
డిప్రెషన్ మొదటి దశలో ఆత్మహత్య ఆలోచనలు రావు, కానీ రెండో దశలో డిప్రెషన్ తీవ్రత పెరిగిన తరువాత ఆత్మహత్య ఆలోచనలు చాలా వస్తాయ్. ఇలాంటి పరిస్థితిలో వెంటనే బయటకు వచ్చి అందరితో మాట్లాడటం ప్రారంభించాలి. స్నేహితులు, బంధువులతో మాట్లాడుతూ వుండాలి. సమస్యలను చెప్పుకుంటూ వుండాలి. ఆత్మహత్య ఆలోచన అలాగే వుంటే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలి.
వ్యతిరేకంగా చేయాలి
డిప్రెషన్‌లో వున్నప్పుడు వచ్చే నిర్ణయాలను వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం చేయాలి. డిప్రెషన్‌లో వున్నప్పుడు ఎవ్వరితో మాట్లాడాలని అనిపించదు, ఏదీ తినాలని కూడా అనిపించదు, ఆత్మహత్య ఆలోచనలు వస్తాయ్. వీటన్నింటికీ మీరు వ్యతిరేకంగా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా డిప్రెషన్ తగ్గిపోతుంది.
పనిలో నిమగ్నం కావడం
డిప్రెషన్‌లో నిరాశలో వుండకుండా, ఇంట్లో పనులు చేసుకోవడం, ఆఫీస్ పనుల్లో నిమగ్నం కావడం, కొత్త పనులను మొదలుపెట్టే ప్రయత్నం చేయడం చేయాలి. ఇలా మెదడు వేరే పని చేయడం ప్రారంభించి డిప్రెషన్‌ను వదిలివేస్తుంది.
సంగీతం
సంగీతానికి చాలా శక్తి వుంది. సంగీతానికి జంతువులు కూడా స్పందిస్తాయ్. సంగీతం వినడం వల్ల డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయ్. మీరు ఎప్పుడు వినని టాప్ మ్యూజిక్ అల్బమ్‌లను, పాటలను వినడానికి ప్రయత్నిస్తే డిప్రెషన్ తగ్గే అవకాశం వుంది.
ప్రకృతితో కలిసి
స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, ఆకాశం, మట్ట వాసన, చెట్లు, పంటలు, లాంటి సహజమైన ప్రకృతిలో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. ప్రకృతిలో గడపడం వల్ల మాసనిక సమస్యలు చాలా తగ్గుతాయని పరిశోధనలో తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications