Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
మీ మెదడును చురుగ్గా చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!
ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా వుండేది. కానీ ఇప్పుడు మానసిక శ్రమ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వుంది. దీని వల్ల మెదడు అలసిపోతుంది. కొందరి మెదడు బలహీనంగా మారిపోతుంది. ఇప్పుడు జరిగేదంతా మానసిక యుద్ధమే. ఇలాంటి పరిస్థితిలో మెదడును చురుగ్గా వుంచుకోవడం చాలా అవసరం. మెదడును చురుగ్గా ఎలా వుంచుకోవాలి. మానసిక నిపుణులు, పరిశోధకులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో తెలుసుకుందాం.
ఎవ్వరూ తెలివైన వారిగా పుట్టారు. జెనిటికల్ వల్ల కొన్ని మార్పులు వుండవచ్చు కానీ వారు చేసే పనుల వల్లే తెలివైన వారిగా గుర్తింపును పొందుతారు. మెదడు శక్తివంతంగా ఉంటే ఏదైనా చేయవచ్చు. కంప్యూటర్‌గా మన మెదడు చాలా రెట్టు మెరుగ్గా పనిచేస్తుంది. మనిషి మెదడును ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు.

నా మెదడు బలహీనంగా వుంది అని అనుకుంటే మీ మెదడు బలహీనంగానే మారుతుంది. బావిలోని కప్ప అదే ప్రపంచం అని అనుకుంటుంది. మెదడు కూడా అలాగే పనిచేస్తుంది. మన మెదడుకు ఇంకా చాలా సామర్ధ్యం వుంది అని అనుకుంటే మెదడు అలాగే మారుతుంది.
కొన్ని అలవాట్లు మెదడును బలహీనంగా మారుస్తాయ్. ఈ అలవాట్లను తగ్గించుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. చాలా మంది టీవీ, మొబైల్‌లో బిజీగా వుంటూ కాలాన్ని వృధా చేస్తూ వుంటారు. ఇది కూడా మెదడును బలహీనపరుస్తుంది. ఫోన్‌లో అవసరం లేనివి ఎక్కువగా చూడ్డం వల్ల మీమీద మీకు ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. దాంతో ఒత్తిడికి గురవుతారు. ఫోన్ చూడ్డం, సిగరెట్ తాగడం, మద్యం తాగడం, మాస్టర్‌బేట్ చేసుకోవడం, ఈ అలవాట్లన్నీ మెదడును మరింత బలహీనంగా మారుస్తాయ్.
జంక్ ఫుడ్, ఫ్రై చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మెదడు దెబ్బ తింటుంది. వీటిని ఆహారంలో ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని అంటన్నారు. ఇంట్లో చేసిన వంటకాలను, పోషకాలు వున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఎక్కువగా ఆలోచించడాన్ని కూడా తగ్గించాలి. ఎక్కువగా ఆలోచిస్తే మానసిక ఒత్తిడికి గురౌతారు. అన్ని పరిస్థితులు మన చేతుల్లో వుండవన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఎక్కువగా ఆలోచించడం వల్ల సమయం మాత్రమే వృధా కాదు, మాససిక ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుందనే సత్యాన్ని గ్రహించాలి.
వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. రోజుకు కనీసం అరగంట అయినా వ్యాయామానికి కేటాయించాలి. చాలా మంది వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపించరు. ఎక్కువ అనారోగ్యం సమస్యలు రావడానికి కూడా ఈ వ్యాయామాన్ని చేయకుండా వుండడమే. వ్యాయామం చేయడం వల్ల మెదడుకు ఎక్కువ ఆక్సీజెన్ వెల్లి మెదడును మరింత చురుగ్గా మారుస్తుంది.
పోషకాలు వున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బయటి ఆహారాన్ని పూర్తిగా ఆపివేయాలి. ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు రోజూ కంటి నిండా నిద్రపోవాలి. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి.
ధ్యానం, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను చేయాలి. ధ్యానం చేయడం వల్ల ఆ రోజు ఏదైనా మానసిక ఒత్తిడి వుంటే తగ్గిపోతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల మెదడుకు ఆక్సీజన్ బాగా అందుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











