Latest Updates
-
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు
శృంగారంలో మంచి అనుభూతి కోసం.. లూజ్ అయిన యోనిని ఇలా టైట్‌గా మార్చుకోండి!
చాలా మంది తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల యోని లూజైపోయినట్లు ఫీలవుతుంటారు. అలాగే నార్మల్ డెలివరీ అయిన మహిళలు కూడా తమ వజైనా లూజ్ అయిందని అనుకుంటారు. వాస్తవానికి యోని భాగం అనేది లూజ్ అవ్వడం అపోహ మాత్రమే. కాకపోతే కొన్ని మజిల్స్ వల్ల అలా అనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ మధ్యే ప్రసవించి ఉన్నా లేదా గర్భం ధరించాలని అనుకుంటున్నా ఈ ఎక్సర్ సైజ్ వల్ల వజైనా త్వరగా సరైన షేప్ లోకి వస్తుంది.
అంతేకాదండోయ్ నార్మల్ డెలివరీ తర్వాత మరింతగా ఎంజాయ్ చేయాలనుకున్నా మెయింటెయిన్ చేయక తప్పదు. ఇవి చేయడం వల్ల శృంగారాన్ని బాగా ఆస్వాదించగల్గుతారు. మీ శృంగార జీవితం బాగుంటుంది. ఈ ఎక్సర్ సైజ్ వెజైనల్ హెల్త్ కి దోహదం చేస్తాయి. దీని వల్ల కొత్తగా పెళ్లైన వారు ఎంజాయ్ చేసినట్లు.. అదే ఫీల్ ను అనుభవిస్తూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఆ ఎక్సర్ సైజ్ లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కెగెల్ వ్యాయామాలు
యోని మజిల్స్ ను బిగుతుగా మార్చుకోవడం కోసం కెగెల్ ఎక్సర్ సైజులు చేయడం బాగా పాపులర్. ఇవి చేయడం చాలా తేలిక. మీ రూంలో మీరు సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. ఇవి చేయడానికి మీరు ముందుగా వెల్లకిలా పడుకుని మీ పెల్విక్ మజిల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. అప్పుడు మీ యోని మజిల్స్ ను స్క్వీజ్ చేయండి. మీరు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఆపితే స్ట్రెయిన్ అయ్యే మజిల్స్ ఇవే. ఈ ప్రాసెస్ ని రిపీట్ చేయండి. దీనివల్ల మీకు ఫలితాలు వెంటనే కనబడకపోయినప్పటికీ.. పదిహేను, ఇరవై రోజుల్లో తేడా బాగా తెలుస్తుంది.
2. లెగ్ రైజెస్
యోని మంచి ఆకారంలో కనిపించడంతో పాటు అద్భుతంగా ఉండాలంటే ఈ ఎక్సర్ సైజ్ చేయాల్సిందే. దీని వల్ల హిప్, అబ్ డొమైనల్ మజిల్స్ టోన్ అవ్వడమే కాకుండా వెజైనల్ మజిల్స్ లూజ్ గా అవ్వకుండా ఉంటాయి. నేల మీద పడుకుని కానీ ఏదైనా బెంచ్ మీద పడుకొని కానీ ఇవి చేయండి. మీ బ్యాక్ కొంచెం బలహీనంగా ఉంటే ఫ్లోర్ మ్యాట్ మీద పడుకున్నప్పుడు లోయర్ బ్యాక్ కి కిందుగా టవల్ వేసుకోండి. స్లోగా రెండు కాళ్లు పైకెత్తండి. రెండూ ఒకేసారి చేయడం ఇబ్బంది అనిపిస్తే ముందుగా ఒక కాలితో చేసి ఆ తర్వాత రెండో కాలితో చేయండి. కాళ్లని వంచకండి. కొన్ని సెకన్లు ఆగి అప్పుడు మళ్లీ కాళ్లు కిందకు దించేయండి. మంచి ఫలితాల కోసం ఈ ఎక్సర్ సైజ్ ని రోజుకు ఐదు సార్లు పది నిమిషాల పాటు చేయండి.
3. స్క్వాట్స్
స్క్వాట్లు చేయడం వల్ల హిప్స్, థైస్ మంచి షఏప్ లోకి మారుతాయి. నిజానికి స్క్వాట్స్ యోని టైట్ గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మీకు ఇంత వరకూ వీటిని చేసి ఉండకపోతే మొద్లో కొద్దిగా కష్టం అవ్వచ్చు. హిప్స్ దూరంలో పాదాలు ఉంచి నిలబడండి. హిప్స్ నుంచి కిందకు వంగడి, మీరు బెంచ్ మీద కూర్చోబోతుంటే ఎలా చేస్తారో అలా. స్క్వాట్స్ చేస్తున్నప్పుడు మీ వెన్నుముక స్ట్రెయిట్ గా ఉండేట్లు ఛాతీ లిఫ్ట్ అయి ఉండేట్లు చూసుకోండి. మళ్లీ నిలబడేటప్పుడు మీ హీల్స్ సపోర్ట్ తో నిలబడండి. మీ మునివేళ్ల మీద నించోకండి.
4. యోగా
పెల్విక్ మజిల్స్ దగ్గరకు వచ్చి దూరం కావడానికి వీలుగా ఉండేలా యోగా హెల్ప్ చేస్తుంది. ఇలా జరగడం వల్ల వెజైనా చాలా బిగుతుగా మారుతుంది. సేతు ఆసనం వంటి కొన్ని ఆసనాలు రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. నేల మీద కూర్చొని కాళ్లు ముందుకు చాచి కూర్చోండి. చేతులు వెనక్కి పెట్టండి. వేళ్లు కూడా వెనక్కి ఉండాలి. నెమ్మదిగా మీ అప్పర్ బాడీ, పెల్విక్ ఏరియాను పైకి లేపండి, మీ చేతులతో సపోర్ట్ తీసుకోండి. మీ తల వెనక్కి ఉంచి మామూలుగా సపోర్ట్ తీసుకోండి. మీ తల వెనక్కి ఉంచి మామూలుగా శ్వాస తీసుకోండి. మీరు ఇలా ఎంత సేపు ఉండగల్గితే అంత సేపు ఉన్నాక మళ్లీ స్టార్టింగ్ పొజిషన్ కు వచ్చేయండి. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ను బలంగా చేయడంలో ఉత్తరాసనం, శలభాసనం కూడా బాగా హెల్ప్ చేస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











