Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలారం వున్నా నిద్రలేవలేకపోతున్నారా..? ఈ ట్రిక్ పాటిస్తే పక్కా లేస్తారు..!
ఉదయం లేవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలిసినా చాలా మంది ఉదయమే నిద్రలేవలేక పోతారు. దీనికి చాలా కారణాలు వున్నాయ్. కొందరు రాత్రి లేటుగా పడుకోవడం, మరికొందరు కావాలనే లేటుగా నిద్రలేవడం చేస్తారు. మరికొందరైతే ఉదయమే లేచి మళ్లీ పడుకుంటారు. ఇలా ఉదయమే నిద్రలేవడమనేది చాలా మందికి సాధ్యం కాని విషయం. కొన్ని రోజులు ఉదయమే నిద్రలేస్తారు కానీ దాన్ని అలాగే కంటిన్యూ చేయలేకపోతారు. అలారం పెట్టుకున్నా సరే దాన్ని మళ్లీ ఆఫ్ చేసి పడుకుంటారు. అలారంలు కూడా ఆ మత్తు నిద్రను ఆపలేవు. ప్రతీ రోజూ లేటు లేచి రేపు ఎలాగైనా త్వరగా నిద్రలేవాలని అనుకుంటారు. అలా ప్రతీ రోజూ అనుకుంటూ జీవితం గడిచిపోతుంది. అలాంటి వారికి ఉదయమే నిద్ర ఎలా లేవాలో కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాము.

ఉదయమే నిద్రలేవడం వల్ల పనులు చేసుకోవడానికి చాలా టైం వుంటుంది. పనులన్నీ కామ్‌గా చేసుకునేందుకు వీలు వుంటుంది. లేటుగా లేవడం వల్ల కంగారు కూడా పెరిగి టెన్షన్ మరింత పెరుగుతుంది. వ్యాయామం చేయడానికి కూడా చాలా సమయం వుంటుంది. నీళ్లు బాగా తాగడానికి టైం వుంటుంది. ఉదయమే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల పొట్ట శుభ్రమవుతుంది. మల విసర్జన కూడా సలభంగా పూర్తిగా అయిపోతుంది.
తొందరగా నిద్రలేవాలంటే ముందుగా త్వరగా పడుకోవాలి. ఇది మీకు ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ మీరు కచ్ఛితంగా చేయాల్సిన పని. లేటుగా పడుకోవడం వల్ల మీరు అప్పటికే బాగా అలసిపోయి వుంటారు. నిద్రసరిపోక ఉదయం లేవకుండా అలాగే వుంటారు.
నిద్రపోయే అరగంట ముందు ఫోన్, ల్యాప్‌టాప్ వాడకుండా వుండాలి. దీనివల్ల మెలటానిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయ్. నిద్రపోవడానికి మెలటోనిన్ కావాలి. ఇలా ఫోన్లు వాడడం వల్ల కూడా నిద్ర రాకుండా వుంటుంది.

కొంతమందికి పుస్తకం తెరవగానే నిద్ర వస్తుంది. స్కూల్ కు వెళ్లే సమయంలో ఇది దాదాపు అందరి లైఫ్‌లెో జరిగేవుంటుంది. రాత్రి చదువుదామని పుస్తకం తీయగానే ఎక్కడా లేని నిద్ర అప్పుడే ముంచుకువస్తుంది. అయితే ప్రస్తుతం మనకు ఎలాంటి హోంవర్కులు వుండయి కాబట్టి ఏవైనా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని పడుకునే ముందు చదవడానికి ప్రయత్నించాలి, లేదంటే ఆడియో బుక్స్ అయినా వినాలి. దీని వల్ల కూడా త్వరగా నిద్ర వస్తుంది.
అలారంను కొంత మంది చాలా దగ్గరగా పెట్టుకుంటారు. అలారం మోగగాని దాన్ని సులభంగా ఆపివేసేలా అలారంను పెట్టుకుంటారు. అలా కాకుండా అలారంను, లేదా ఫోన్‌ను పడుకునే ప్రాంతం నుంచి చాలా దూరంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అలారం మోగినప్పుడు లేచి నిలబడి నడుచుకుంటూ వెళ్లి అలారంను ఆపివేస్తాం. ఈ సమయంలో మళ్లీ పడుకోకుండా జాగ్రత్తపడితే తొందరగా నిద్రలేవచ్చు.
ఉదయమే నిద్రలేవలేకపోతే, ఎందుకు నిద్రలేవాలి అనే దాని గురించి ఆలోచించండి. ఉదయమే నిద్రలేవడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయ్, ఎన్ని పనులు జరుగుతాయో మనసులో అంచనా వేసుకోండి. గొప్ప వ్యక్తలందరూ ఉదయమే లేస్తారనే విషయాన్ని మీరు గ్రహించాలి.
ఉదయం అలారం మోగగానే నిద్రలేవడానికి ప్రయత్నించి వెంటనే ఒక లీటరు నీరును తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం చురుకుగా మారి మళ్లీ నిద్రపోకుండా చేస్తుంది. ఒక రోజు ఉదయమే నిద్రలేచి, ఇదే అలవాటును 21 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే మీకు ఈ అలవాటు ఎప్పటికీ వుంటుంది. మీకు తెలియకుండానే మీరు ప్రతీ రోజూ నిద్ర లేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications