Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
Study: డెల్టా ప్లస్.. డేంజర్ బెల్స్ ను కరోనా వ్యాక్సిన్లు అడ్డుకుంటాయా?
కరోనా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ వ్యతిరేకంగా ఎలా పని చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కలవరపెడుతుందో అందరికీ తెలిసిందే. అయితే కోవిద్-19 భూతాన్ని తరిమి కొట్టేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి కొన్ని వ్యాక్సిన్లు కనిపెట్టారు. ప్రస్తుతం ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి.

వీటి నుండి అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్తగా డెల్టా వేరియంట్లు వచ్చి మళ్లీ అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు.. కోవిద్ నుండి కోలుకున్న వారిలోనూ రీ-ఇన్ ఫెక్షన్లకు కారణమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్ లో తీవ్ర ప్రభావాన్ని చూపిన డెల్టా వేరియంట్ (B.1.617.2)ను తటస్థీకరించడంలో కరోనా వ్యాక్సిన్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే విషయాలపై పలు అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనంలో కరోనా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడంలో ఎంతమేరకు పని చేస్తున్నాయనే వివరాలను వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తక్కువ ప్రభావం..
కోవిద్-19 వ్యాక్సిన్ల వల్ల మన బాడీలో యాంటీబాడీలు డెవలప్ అవుతాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇవి డెల్టా వేరియంట్లను ఎదుర్కోవడంలో మాత్రం కాస్త తక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని తాజా అధ్యయనంలో తేలిందట. ముఖ్యంగా వూహాన్ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడంలో యాంటీ బాడీల సామర్థ్యం తక్కువగానే ఉన్నట్లు తేలింది.

ఇన్ ఫెక్షన్ తక్కువగా..
డెల్టా వేరియంట్లకు సంబంధించిన అధ్యయనంలో భాగంగా.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వైరస్ సోకిన (Breakthrough Infections) సుమారు వంద మంది ఆరోగ్య కార్యకర్తల సమాచారాన్ని భారత పరిశోధకులు పరిశీలించారు. అందులో డెల్టా వేరియంట్ సోకిన వారిలోనే ఎక్కువ వైరల్ లోడ్ ఉందని.. ఇతర రకాలు సోకిన వారిని పరిశీలిస్తే.. వారిలో ఇన్ఫెక్షన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఎక్కువ సంక్రమణ..
వైరస్ సోకిన వారిలో డెల్టా వేరియంట్ సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు తేలిందట. ముఖ్యంగా డెల్టా వేరియంట్లలో స్పైక్ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందున అవి ఊపిరితిత్తుల కణాలకు తేలికగా అతుక్కుపోతున్నట్లు వెల్లడించారు. తద్వారా వూహాన్ స్ట్రెయిన్ తో పోలిస్తే చాలా ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ సోకేందుకు డెల్టా వేరియంట్ కారణమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

జాగ్రత్తగా ఉండాలి..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లన్నీ వూహాన్ లో నుండి వెలుగులోకొచ్చిన కరోనా రకాన్ని పరిగనణనలోకి తీసుకునే రూపొందించారు. అయితే కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా వేరియంట్లను ప్రస్తుత టీకాలు బాగానే ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కానీ, వూహాన్ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడంలో మాత్రం వ్యాక్సిన్లు కాస్త తక్కువ సామర్థ్యాన్ని కనబరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కరోనా నిబంధనల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే..
ఎవరైతే కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేస్తారో.. అలాంటి వారంతా మ్యుటేషన్లకు స్వాగతం పలికినట్టేనని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని పరిశోధకులు డాక్టర్ చాంద్ వాట్టల్ హెచ్చరించారు. వ్యాక్సినేషన్లో అందరికంటే ముందుకున్న బ్రిటన్ వంటి దేశాల్లో మరోసారి కూడా కరోనా మహమ్మారి పెరగడానికి డెల్టా వేరియంట్ కారణమనే విషయాన్ని గుర్తు చేశారు.

భారత్ లో డెల్టా ఆధిపత్యం..
భారతదేశంలో బయటపడిన డెల్టా రకం(B.1.617.2) కరోనా వైరస్ ను ‘ఆందోళనకర వేరియంట్'గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ రకానికి వైరస్ ఇన్ఫెక్షన్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో పాటు కరోనా బారిన పడి కోలుకున్న వారి యాంటీబాడీల నుండి తప్పించుకోవడంతో భారత్ లో ఈ వైరస్ ఆధిపత్యం కొనసాగిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications











