Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అంగస్తంభన సమస్యకు యోగాసనాలు, పడగ్గదిలో రెచ్చిపోవాలంటే ఈ ఆసనాలు సాధన చేయండి
శారీరక సమస్యల గురించి ఎవరికైనా చెప్పుకోవచ్చు.. చెప్పుకుంటాం కూడా. కడుపు నొప్పి, కాలు నొప్పి గురించి, గ్యాస్ ట్రబుల్ గురించి ఎవరితోనైనా పంచుకుని చిట్కాలు అడుగుతాం. మానసిక సమస్యలను కనీసం దగ్గరి వారికైనా చెప్పుకుంటాం. అయితే లైంగిక సమస్యలను మాత్రం ఎవరితోనూ పంచుకోం. లైంగిక సమస్యల గురించి చెబితే ఎక్కడ చిన్నచూపు చూస్తారోనని భయం. కొన్ని లైంగిక సమస్యలను మెజార్టీ పురుషులు ఎదుర్కొంటారు. కానీ వాళ్లు ఎవరితోనూ షేర్ చేసుకోరు.
చాలా మంది పురుషులు ఎదుర్కొనే సాధారణ లైంగిక సమస్య పురుషాంగం సరిగ్గా స్తంభించకపోవడం. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ చాలా కారణాల వల్ల వస్తుంది. అధిక బరువు, అధిక రక్తపోటు, డయాబెటిస్, ధూమపానం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటి కారణాల వల్ల పురుషాంగం గట్టిపడదు. సెక్స్ చేయడానికి అంగం స్తంభించడమే కీలకం.
అంగస్తంభన సమస్యను చాలా మంది పురుషులో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటారు. చాలా సాధారణమైన ఈ సమస్యను పరిష్కరించడానికి యోగా చాలా బాగా పని చేస్తుంది. కొన్ని రకాల భంగిమలు సాధన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి అంగం సరిగ్గా స్తంభిస్తుంది.
అంగస్తంభన సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి యోగా భంగిమలు సాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కుంభకాసనం:
నేలకు అభిముఖంగా కింద పడుకోవాలి. తర్వాత కాలి వేళ్లను నేలకు తాకించాలి. ఇప్పుడు రెండు అర చేతులను నడుము వరకు తీసుకువచ్చి నేలపై పెట్టాలి. ఇప్పుడు తల పైకెత్తి ఎదురుగా చూస్తుండాలి. తర్వాత శరీరాన్ని చేతులపై, కాలి వేళ్లపై బ్యాలెన్స్ చేస్తూ ప్లాంక్ పొజిషన్ లోకి రావాలి. ఈ భంగిమలో 30 నుంచి 60 సెకన్ల పాటు ఉండేందుకు ప్రయత్నించాలి.

2. ధనురాసనం:
ముందు నేలకు అభిముఖంగా పడుకోవాలి. ఇప్పుడు కాళ్లకు కొద్దిగా పైకి ఎత్తి పాదం, కాలు జాయింట్ వద్ద చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని పొట్ట, పొత్తి కడుపుపై ఉంచి తొడలను, పై శరీరాన్ని పైకి ఎత్తాలి. ఎదురుగా చూస్తూ ఈ భంగిమలో వీలైనంత వరకు శరీరాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించాలి. ఈ భంగిమ చూడటానికి ధనుస్సు ఆకారంలో ఉంటుంది.

3. ఉత్తానపాదాసనం:
ఆకాశం వైపు చూస్తూ నేలపై నిటారుగా కింద పడుకోవాలి. అర చేతులను నేలపై పిరుదుల పక్కగా ఉంచాలి. తలను ఏమాత్రం పైకి ఎత్తకుండా కాళ్లను నిటారుగా పైకి ఎత్తడానికి ప్రయత్నించాలి. అలా 90 డిగ్రీల కోణంలో కాళ్లను పైకి ఎత్తాలి. ఈ భంగిమలో కొద్దిసేపు అలాగే ఉండాలి. ఈ భంగిమ వల్ల నడుము భాగం బలంగా తయారవుతుంది. దీని వల్ల కింది శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

4. పశ్చిమోత్తనాసనం:
ముందుగా నేలపై కూర్చోవాలి. కాళ్లను నిటారుగా నేలపై ఉంచాలి. 90 డిగ్రీల కోణంలో కూర్చోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుము, శరీర పైభాగం ముందుకు వంచాలి. రెండు చేతులతో అరికాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ముఖాన్ని రెండు మోకాళ్ల మధ్యలో ఉండేలా భంగిమను ప్రయత్నించాలి. ఇలా కాసేపు ఇదే ఆసనంలో ఉండాలి.

5. నౌకాసనం:
ముందుగా నేలపై ఆకాశం వైపు చూస్తూ పడుకోవాలి. తర్వాత రెండు కాళ్లను నిటారుగా ఉంచి పైకి లేపాలి. ఇప్పుడు రెండు కాళ్ల బొటన వేళ్లను రెండు చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు కాళ్లు, వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తలను వెన్నెముకకు సమాంతంరా ఉంచి పైకి చూస్తుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications