Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తెల్లవారుజామున నిద్ర లేస్తే మంచిదేనా?.. రీసెర్చ్‌లో సంచలన వెలుగులోకి సంచలన విషయాలు
నిద్ర అనేది ఒక ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులతో పాటు వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఎంత ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుందని విశ్వశిస్తూ ఉంటారు. గాఢంగా నిద్రపోతే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఏ పనినైనా పూర్తి చేసేస్తారు. అందుకే మన దేశంలో పిల్లలను త్వరగా పడుకోబెట్టి.. ఉదయాన్నే లేపుతుంటారు.
ఉదయాన్నే నిద్రలేవడం మంచిదేనా?
ఇన్నాళ్లు ఉదయాన్ని నిద్రలేవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఉదయాన్నే నిద్రలేవడం కంటే.. ఆలస్యంగా నిద్రలేవడం మంచిదని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. నిద్రపై తాము ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని న్యూరో సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే?
మొత్తం 26,000 మందిపై ఈ పరిశోధనలు నిర్వహించినట్లు ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇందులో రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం ఆలస్యంగా లేచే వారిలో కాగ్నిటివ్ ఫంక్షన్ ఎక్కువగా ఉంటుందని తేలినట్లు వెల్లడించారు. ఆలస్యంగా లేచే వారిలో ఇంటెలిజెన్స్, రీజనింగ్, జ్ఞాపకశక్తి సామర్ధ్యాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ పరీక్షల్లో రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం ఆలస్యంగా లేచిన వ్యక్తులు ఉత్తమ స్కోర్ సాధించారని పేర్కోన్నారు.
ఎంత సమయం నిద్రపోవాలంటే
వైద్యులు తరచూ వీలైనంత ఎక్కువ గంటలు నిద్రపోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతమున్న కార్పొరేట్ కాలంలో అది ఎవరికీ సాధ్యం కావడం లేదు. కొందరైతే కేవలం 4 గంటలు మాత్రమే పడుకొని వారి ఆరోగ్యాన్ని వారే ఖరాబు చేసుకుంటున్నారు.
అయితే ప్రతీ మనిషి రోజులో కనీసం 7 గంటలు, అత్యధికంగా తొమ్మిది గంటలు నిద్రపోవాలి ఆరోగ్య నిపుణులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎవరైతే ఏడు గంటల కంటే తక్కువ, తొమ్మిది గంటల కంటే ఎక్కువగా నిద్రపోతారో.. వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి వ్యక్తుల్లో ఉభయకాయం, రక్తపోటు, గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. కొన్నికొన్ని సందర్భాల్లో వ్యక్తులూ క్యాన్సర్ బారిన పడే ఛాన్సుందని హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుతమున్న గజిబిజీ ప్రపంచంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అందుకోసం తగిన ఆహారంతో పాటు తగినంత నిద్ర కూడా ఉండాలి. అప్పుడే పాత కాలం మనుషుల మాదిరిగా మనం కూడా వందేళ్లు కాకపోయినా కనీసం 70 ఏళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించొచ్చు.
గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన అంశాలన్నీ మాకు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారమ్ ఆధారంగా అందించబడింది. వీటినీ ఫాలో అయ్యే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications