Latest Updates
-
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026 -
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే!
రోజుకు ఒక్కసారైనా టాయిలెట్ కి వెళ్లాల్సిందేనా? మలవిసర్జన రోజుకు ఎన్నిసార్లు వెళ్లడం నార్మల్?
మలవిసర్జన గురించి మాట్లాడేందకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు..కానీ నిజంగా మన ఆరోగ్యం ఎలా ఉండే చెప్పే ముఖ్యమైన సూచికల్లో ఇది ప్రధానమైనది. అయితే చాలామంది రోజూ ఉదయం,సాయంత్రం టాయిలెట్ కి వెళ్లడం మంచిదని అనుకుంటుంటారు. మరికొందరు అయితే రోజుకు కనీసం ఒక్కసారి అయినా వెళ్లాలి,లేదంటే ఏదైనా అనారోగ్యం ఉన్నట్లే భావిస్తుంటారు.
అయితే అసలు రోజుకు ఒక్కసారి అయినా టాయిలెట్ కి వెళ్లాల్సిందే అని ప్రజలు తమకు తాము పెట్టుకున్న రూల్ నిజమేనా? ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ దీనిపై స్పష్టతనిచ్చారు. డాక్టర్ జోసెఫ్ ప్రకారం.. మలవిసర్జన విషయంలో అందరికీ ఒకే రూల్ వర్తించదు.

ఎన్ని సార్లు వెళ్లడం నార్మల్?
డాక్టర్ జోసెఫ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం ..రోజుకు ఒకసారి మలవిసర్జన చేయడం మంచి అలవాటే అయినప్పటికీ కేవలం అది మాత్రమే ఆరోగ్యానికి ప్రామాణికం కాదు.
వైద్యపరమైన మార్గదర్శకాల ప్రకారం..రోజుకు మూడు సార్లు వెళ్లడం నుండి, వారానికి మూడు సార్లు వెళ్లడం వరకు.. ఈ మధ్యలో ఏది జరిగినా అది ఆరోగ్యకరమైన పరిధిలోకే వస్తుంది.
అంటే ఒక వ్యక్తి రోజుకు మూడుసార్లు వెళ్లొచ్చు, మరొక వ్యక్తి రెండు రోజులకోసారి వెళ్లొచ్చు. ఈ రెండు సందర్భాలూ సాధారణమే. ఇక్కడ ముఖ్యం సంఖ్య కాదు, మీ శరీరానికి ఏది అలవాటు అనేది. ఉదాహరణకు, ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి రోజుకు ఒక్కసారే వెళ్తుంటే అది అతనికి నార్మల్. మరొకరు రోజు విడిచి రోజు వెళ్తుంటే అది వారికి నార్మల్.
సంఖ్య కంటే ముఖ్యమైనవి ఇవే..
మీరు ఎన్నిసార్లు టాయిలెట్‌కి వెళ్తున్నారు అని లెక్కబెట్టుకోవడం కంటే డాక్టర్ జోసెఫ్ మరో మూడు విషయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
స్థిరత్వం: మీరు విసర్జించేటప్పుడు మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ నీళ్ళలా కాకుండా సాఫీగా ఉండాలి. రోజుకు చాలాసార్లు వెళ్తున్నా సరే, అది చిన్న చిన్న ఉండలుగా (Pellets) వస్తుంటే అది మలబద్ధకమే కావచ్చు.
ఆకారం: ఆరోగ్యకరమైన మలం సాధారణంగా 'సాసేజ్' లాగా లేదా పాము ఆకారంలో, నునుపుగా ఉండాలి. ఉపరితలంపై తేలికపాటి పగుళ్లు ఉన్నా పర్వాలేదు.
కలర్: సాధారణంగా మలం గోధుమ రంగులో ఉండాలి. మనం తినే ఆహారాన్ని బట్టి అప్పుడప్పుడు రంగు మారడం సహజమే. కానీ, ఎరుపు (రక్తం), నలుపు లేదా పసుపు రంగులో తరచుగా వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాలి.
ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?
ఫ్లష్ చేసే ముందు ఒక్క క్షణం పరిశీలించుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ రెగ్యులర్ అలవాట్లలో అకస్మాత్తుగా మార్పులు వస్తే అది అనారోగ్యానికి సంకేతం కావచ్చు.
వరుసగా మూడు రోజుల కంటే ఎక్కువ మలవిసర్జన కాకపోతే అది మలబద్ధకాన్ని సూచిస్తుంది. రెండు వారాలకు మించి మీ అలవాట్లలో మార్పులు గమనించినా మలం గట్టిగా రావడం, విపరీతమైన ఒత్తిడి, నొప్పి, మలంలో రక్తం, వివరించలేని బరువు తగ్గడం, లేదా తీవ్రమైన అలసట ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications