Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్పార్క్‌లింగ్ వాటర్ తాగి బరువు తగ్గించుకోవచ్చా?
స్పార్క్‌లింగ్ వాటర్ అంటే కార్బొనేట్ చేయబడిన నీరు. అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువును ఆ నీటికి కలుపుతారు. దీంతో సాధారణ నీరు చిన్న చిన్న బుడగలుగా కనిపిస్తుంది. అది కాస్త మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. అలా కార్బొనేట్ నీటిని స్పార్క్‌లింగ్ వాటర్ అంటారు.
బరువు తగ్గడానికి స్పార్క్‌లింగ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చక్కెర పానీయాలకు బదులు స్పార్క్‌లింగ్ వాటర్ తాగిన వ్యక్తులు 12 వారాల వ్యవధిలో ఎక్కువ బరువు కోల్పోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

స్పార్క్‌లింగ్ వాటర్ ప్రయోజనాలు
కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది:
స్పార్క్‌లింగ్ వాటర్ తాగితే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. స్పార్క్‌లింగ్ వాటర్ లోని కార్బన్ డయాక్సైడ్ కడుపుని స్ట్రెచ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కడుపు నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాన్ని పంపిస్తుంది.
ఎక్కువ నీరు తాగాలనిపిస్తుంది:
స్పార్క్‌లింగ్ వాటర్ రోజంతా ఎక్కువ నీరు తాగడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది చాలా ముఖ్యం. నీరు జీవక్రియను పెంచుతుంది. అలాగే నీరు తాగితే తక్కువ ఆకలి వేస్తుంది.
చక్కెర పానీయాలు తాగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు:
సోడా, జ్యూస్ వంటి చక్కెర పానీయాలను తగ్గించడంలో స్పార్క్‌లింగ్ వాటర్ సహాయపడుతుంది. చక్కెర పానీయాల్లో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దోహదంచేస్తాయి.
స్పార్క్‌లింగ్ వాటర్ సైడ్ ఎఫెక్ట్స్:
కడుపు ఉబ్బరం:
స్పార్క్‌లింగ్ వాటర్ తాగడం వల్ల కొంత మందిలో కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. గ్యాస్ కు కూడా కారణం కావొచ్చు. స్పార్క్‌లింగ్ వాటర్ లోని కార్బన్ డై ఆక్సైడ్ జీర్ణ వ్యవస్థను చికాకుపెడుతుంది.
కృత్రిమ స్వీటెన్లు ఉండొచ్చు:
కొన్ని స్పార్క్‌లింగ్ వాటర్ లలో అదనపు చక్కెర, కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.
బరువు తగ్గడానికి స్పార్క్‌లింగ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుందని ఆధారాలు చెబుతున్నాయి. అయితే స్పార్క్‌లింగ్ వాటర్ లో అదనపు చక్కెర, కృత్రిమ స్వీటెనర్లు లేవని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. అలాగే స్పార్క్‌లింగ్ వాటర్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ మితంగా మాత్రమే తీసుకోవాలి. దాహం వేసినట్లు స్పార్క్‌లింగ్ వాటర్ తీసుకుంటే మంచిది. అలాగే అతిగా మాత్రం తాగొద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications