Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
ఎక్కువసేపు నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా..
ప్రస్తుతం ఏదో ఒక కారణంతో అందరి జీవితాలు బిజీ బిజీగా మారిపోతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తక్కువ నిద్రపోవడమే గొప్ప విజయంగా, ఉత్పాదకతకు చిహ్నంగా చాలామంది భావిస్తుంటారు. నాలుగు గంటలే పడుకున్నా అని గొప్పగా చెప్పుకునే వారిని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఆలోచన మన ఆరోగ్యాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో తెలుసా? నిజానికి కొన్నిసార్లు కాస్త ఎక్కువగా, ప్రశాంతంగా నిద్రపోవడం మన శరీరానికి, మనసుకు మనం ఇచ్చే అమూల్యమైన బహుమతి లాంటిది. ఎక్కువసేపు సోమరిపోతులు నిద్రపోతారు అని కొందరు పెద్దలు తిడుతుంటారు..అయితే ఇది సోమరితనం కాదు, మనల్ని మనం బాగుచేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ.
మెదడుకు రీఛార్జ్
మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. రోజంతా పనిచేసి అలసిపోయిన ఈ కంప్యూటర్ కు సరైన రీస్టార్ట్ అవసరం. ఆ రీస్టార్ట్ బటనే నిద్ర. మీరు సరిపడా నిద్రపోయినప్పుడు మీ మెదడు ఒకరకంగా రీఛార్జ్ అవుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం..నిద్ర మెదడులోని డేటా ప్రాసెసింగ్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, అనవసరమైన ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి. ఉదయాన్నే మీరు ఒక కొత్త ఉత్సాహంతో, తేలికైన మనసుతో మేల్కొనడానికి కారణం ఇదే.

శరీరానికి ఒక రిపేర్ వర్క్ షాప్
నిద్రపోతున్నప్పుడు మన శరీరం ఖాళీగా ఉండదు, అది ఒక రిపేర్ వర్క్ షాప్ లా మారిపోతుంది. రోజంతా కష్టపడటం వల్ల అలసిపోయిన కండరాలకు, దెబ్బతిన్న కణాలకు మరమ్మతులు చేసే పని రాత్రిపూటనే జరుగుతుంది. నిద్రలో విడుదలయ్యే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (HGH) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కండరాలను బాగుచేస్తుంది, అలసటను దూరం చేసి, మన శరీరానికి కొత్త శక్తిని అందిస్తుంది. అందుకే మంచి నిద్ర తర్వాత మనం ఎంతో చైతన్యవంతంగా ఉంటాం.
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం
మీరు తరచుగా జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నారా? బహుశా మీ నిద్ర సరిపోవడం లేదేమో. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం మనం నిద్రలో ఉన్నప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ అత్యంత యాక్టివ్ గా పనిచేస్తుంది. వైరస్ లు, బ్యాక్టీరియాలపై పోరాడే సైనికుల్లాంటి తెల్ల రక్తకణాలను శరీరం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. తగినంత నిద్ర మన శరీరానికి ఒక అభేద్యమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.

గుండెకు మేలు, బరువుకు చెక్
ప్రశాంతమైన నిద్ర మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. నిద్రలో రక్తపోటు, హార్ట్ బీట్ రేటు సాధారణ స్థాయికి వస్తాయి. ఇది గుండెపై భారాన్ని తగ్గించి, దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి మన ఆకలిని నియంత్రించే హార్మోన్ల (గ్రెలిన్) అసమతుల్యతకు కారణమవుతుంది. అందుకే, నిద్ర సరిగా లేనప్పుడు మనకు ఎక్కువగా తినాలనిపిస్తుంది. మంచి నిద్ర జీవక్రియను సమతుల్యం చేసి, బరువు పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది గుర్తుంచుకోండి
అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు ఏదైనా మితంగానే ఉండాలి. రోజుకు 10-12 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నా మీకు ఇంకా అలసటగా, నీరసంగా అనిపిస్తుంటే అది ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలు దీనికి కారణం కావచ్చు. అలాంటి సందర్భాలలో డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
