Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
బాబా రాందేవ్ ఫార్ములా..తొమ్మిది రోజుల్లో 5 కిలోల బరువు తగ్గొచ్చు!
శరన్నవరాత్రులు వచ్చేశాయి. ఈ తొమ్మిది రోజుల ఉపవాస దీక్ష ద్వారా మన శరీరంలో తిష్టవేసిన వ్యాధులనే రాక్షసులను సంహరించుకునే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. నవరాత్రి ఉపవాసం కేవలం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే కాకుండా అది మన శరీరాన్ని శుభ్రపరిచి, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన వైజ్ఞానిక ప్రక్రియ. ఈ తొమ్మిది రోజులు మీరు చేసే ఉపవాసంతో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా తొమ్మిది రకాల వ్యాధుల ముప్పు నుండి బయటపడవచ్చు.
ఊబకాయం అనే ఆధునిక రాక్షసుడు
ప్రస్తుతం మనదేశంలో లక్షల మందిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. చెడు ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలు మన ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ఇటీవల యూనిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో తొలిసారిగా తక్కువ బరువున్న పిల్లల కన్నా అధిక బరువున్న పిల్లల సంఖ్య పెరిగిపోయింది. భారతదేశంలోనే దాదాపు 14 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఊబకాయమే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకర వ్యాధులకు మూలం.

ఉపవాసం ఎలా పనిచేస్తుంది?
నవరాత్రి ఉపవాసం ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం. ఉపవాస సమయంలో మనం తేలికైన, సాత్విక ఆహారం తక్కువ పరిమాణంలో తీసుకుంటాం. దీనివల్ల శరీరానికి అందే కేలరీలు తగ్గుతాయి. అప్పుడు శరీరానికి అవసరమైన శక్తి కోసం, అది అప్పటికే పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల సహజంగానే బరువు తగ్గడం మొదలవుతుంది. మీరు సరైన పద్ధతిలో ఉపవాసం ఉంటే రోజుకు అర కిలో చొప్పున తొమ్మిది రోజుల్లో సుమారు 4-5 కిలోల బరువు సులభంగా తగ్గవచ్చు.
బాబా రామ్ దేవ్ సూచించిన ఆరోగ్య సూత్రాలు
-నవరాత్రి సమయంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం, బరువు తగ్గడానికి బాబా రామ్ దేవ్ కొన్ని అద్భుతమైన చిట్కాలు సూచించారు.
-మీ రోజును అల్లం-నిమ్మరసం టీతో ప్రారంభించండి. ఇది శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది.
-బరువు తగ్గడానికి 200 మి.లీ. నీటిలో 3-6 గ్రాముల దాల్చిన చెక్క వేసి మరిగించి, దానికి ఒక చెంచా తేనె కలిపి తాగండి.
-రాత్రి పడుకునే ముందు, గోరువెచ్చని నీటితో ఒక చెంచా త్రిఫల చూర్ణం తీసుకోండి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి బరువును తగ్గిస్తుంది.
-ఉదయం ఆపిల్ సైడర్ వెనిగర్, రాత్రి పసుపు పాలు తాగడం కూడా ఎంతో మేలు చేస్తుంది.
జీవనశైలి మార్పులు
-ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగా లేదా వ్యాయామం చేయండి.
-ధూమపానం వంటి చెడు అలవాట్లను మానేయండి.
-తప్పనిసరిగా 8 గంటల పాటు నిద్రపోండి.
-పుష్కలంగా నీరు తాగండి, జంక్ ఫుడ్ కు పూర్తిగా దూరంగా ఉండండి.
-లిఫ్ట్ కు బదులుగా మెట్లను ఉపయోగించండి.
-భోజనం చేసిన వెంటనే కాకుండా, కనీసం రెండు గంటల తర్వాత నిద్రపోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
