Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
ఎండా కాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే కొబ్బరిబోండా, పుచ్చపండు, నిమ్మరసం లాంటి పళ్లు, డ్రింక్స్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. వేసవిలో డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే నీళ్లు తాగడమే కాదు కొన్ని రకాల ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

వేసవిలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాల్సిందే..
ఈ వేసవిలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఈ రెండూ శరీరంలో వేడిని పెంచుతాయ్. ఈ పానియాలు కొంత ఉత్తేజం తెచ్చినప్పటికీ మనల్ని కూల్‌గా ఉంచదు. దీనికి పైగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
ఎండాకాంలో మామిడికాయ పచ్చడంటే చాలా మంది పడిచచ్చిపోతుంటారు. పచ్చడని ఎమోషన్‌లా చూస్తారు. ప్రతీరోజూ కొంతకూడా తినకుండా ఉండని పరిస్థితిలోకి జారుకుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. పచ్చడలు బాడీలో వేడిని పెంచుతాయ్. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల సోడియం కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ పచ్ఛళ్లకు కూడా దూరంగా ఉండాలి.
బయట తయారు చేసే రుచికరమైన జంక్‌ఫుడ్స్ కూడా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి. తినాలనిపించినప్పుడు జంక్‌ఫుడ్‌లో ఉండే ఆహారాన్ని ఇంట్లో వండుకొని తినాలి.
మిల్క్‌షేక్‌లు, చాక్లెట, ఐస్‌క్రీంలకు శరీరంలోని నీటిని పీలుస్తాయి. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.
వంటలో ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. ఉప్పుకు నీటిని పీల్చివేసే తత్వం ఉంటుంది. అందువల్ల ఉప్పుకు కూడా దూరంగా ఉండాలి.
చల్లని నీళ్లు తాగాలనిపించడం చాలా సహజం. కూల్‌డ్రింక్స్, కూల్‌జ్యూసెస్, కూల్‌వాటర్, వీటన్నింటికీ దూరంగా ఉండాలి.
వేసవిలో మద్యం తాగడం వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ అయ్యే అవకావం ఉంది. శరీరంలో వేడిని పెంచి డీహైడ్రేట్ చేసే లక్షణం మద్యానికి ఉంది. కాబట్టి వేసవిలో మద్యానికి పూర్తిగా గుడ్‌బై చెప్పినా అది మీకు ఆరోగ్యకరమైన విషయమే.
బయట తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌లో కారం, మసాలాలు ఒక నియమం లేకుండా ఉప్పు, కారం, మసాాలాలు వేయడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలను ఎదుర్కుంటుంది.
రెడ్ మీట్‌లకు వేడిని పెంచే లక్షణం ఉంటుంది. ఆవు మాంసం, పంది మాంసం, మేక మాంసం ఇవన్నీ రెడ్ మీట్ క్యాటగిరీలో వస్తాయ్. కాబట్టి ఈ రెడ్‌మీట్‌లకు దూరంగా ఉండాలి. చికెన్, చేపలు, రొయ్యలు లాంటివి రెడ్ మీట్ క్యాటగిరీల్లోకి రావు కాబట్టి వీటిని తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications