Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఇంట్లోనే సమ్మర్ డ్రింక్స్.. బయటి పానియాలకు గుడ్‌బాయ్..
ఎండలు బాగా మండిపోతున్నాయ్. బయట ఎక్కడ చూసినా సరే రకరకాలు పానియాలు కనిపిస్తాయ్. అవన్నీ తాగాలని నోరూరుతుంది. కానీ అవన్నీ అపరిశుభ్రంగా, అనారోగ్యానికి దారితీసేవిగా ఉంటాయ్. ఇంట్లోనే అలాంటి పానియాలను తయారు చేసుకొని బయటకు వెళ్లినప్పుడు దగ్గరపెట్టికొని తాగితే ఆరోగ్యానికి మంచిదే కాకుండా డబ్బులు కూడా చాలా ఆదా చేసుకుంటారు. అలాంటి వేసవి పానియాల గురించి తెలుసుకుందాం.

మంచినీరు
సమ్మర్ పానియాల్లో మంచినీరు ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఎండాకాలంలో శక్తిని మొత్తం బయటి వాతావరణం పీల్చేస్తుంది. చాలా సులభంగా డీహైడ్రేట్ అయిపోతుంటారు. కాబట్టి అవసరమైనన్ని మంచినీళ్లు తాగడం మంచిది. మంచినీళ్లలో పోషకాలు, ఎన్జైములు, విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం వంటివి ఉంటాయ్.
నిమ్మ రసం
ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు నిమ్మరసాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకొని వెళ్లవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ నిమ్మరసం చాలా దోహదం చేస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్ మూలకాలు శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. నిమ్మరసం తాగితే డీహైడ్రేషన్‌కు అస్సలు గురికాకుండా ఉంటారు.
జీర రసం
జీలకర్ర నీరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. పరిగడుపున జీలకర్ర నీరుతాగితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. శరీరానికి దోసకాయ రసం కూడా చాలా మంచిది డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది.
యాపిల్ జ్యూస్
యాపిల్ జ్యూస్ కూడా చాలా మంచిది. బయట జ్యూష్ షాపుల్లో యాపిల్ జ్యూస్‌ను పాడైపోయిన పళ్లతో చేస్తారు. అది ఆరోగ్యానికి హానికరం. ఫ్రెష్ యాపిల్స్‌ను కొనుక్కొని ఇంట్లోనే తయారు చేసుకొని తాగితే అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. బయట జ్యూస్‌లు తాగినే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
మజ్జిగ
అందరికీ సులభంగా అందుబాటులో ఉండే పానీయం మజ్జిగ. జీర్ణసమస్యలు, అసిడిటీ ఎవైనా ఉంటే మజ్జిగతో తగ్గుతాయ్. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఆమ్ పన్నా రసం
ఆమ్ పన్నా రసం.. ఈ రసాన్ని మహారాష్ట్రవారు వేసవిలో చేసుకుంటారు. మామిడి పండు రసంలో జీలకర్ర, పూదిన ఆకులు వేసి తాగితే శరీరాన్ని ఫుల్ రీఫ్రెష్ చేస్తుంది. ఎంత ఎండ ఉన్నా సరే మీ శరీరం యాక్టివ్‌గా డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
జల్‌జీర
జల్‌జీర రసాన్ని ఊహించుకుంటే నోటిలో లాలాజలం నిండిపోతుంది. జీలకర్రని వేయించి పొడిగా చేసుకొని నీళ్లల్లో కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయ్.
సత్తుపొడి షర్బత్
బిహార్ వాళ్లు చేసుకునే సత్తుపొడి షర్బత్ కూడా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. సత్తుపొడిలో చక్కెర కొంచం నల్లుప్పు చల్లటి నీళ్లల్లో కలుపుకొని తాగితే ఇక ఆ చల్లదనం రుచి ఆస్వాదించాల్సిందే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications