Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
బీట్‌రూట్ అన్ని కూరగాయల్లోకి కొంత ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. దీన్ని వండుకొని అలాగే తినవచ్చు. ఫ్రై చేసుకొని తినొచ్చు. ఆయుర్వేదంలో బీట్‌రూట్‌కు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు ఇంకా ఎన్నో పోషకాలున్నాయ్. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతీరోజూ బీట్‌రూట్ తాగితే రక్తహీనత అస్సలు ఉండదని అటు ఆయుర్వేద నిపుణులు ఇటు వైద్యులు చెబుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయ్. వాటిలో ప్రధానమైనవాటిని తెలుసుకుందాం.
ఫొలేట్, బివిటమిన్
గర్భిణులకు కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఫొలేట్, బి విటమిన్ చాలా అవసరమౌతుంది. ఈ ఫొలేట్ బీట్‌రూట్ జ్యూస్‌లో అధికంగా ఉంటుంది. ప్రతీరోజు గర్భిణులు క్రమం తప్పకుండా బీట్‌రూట్ తీసుకోవాలి వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల
శరీరంలో గనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే..అంటే కొవ్వు ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌లో ఉండే బెటానిన్ ఆ కొవ్వును తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే తగ్గే అవకాశం ఉంది.

రక్తపోటు తగ్గింపు
బీట్‌రూట్‌లో రక్తపోటును తగ్గించే నైట్రేట్ పోషకం ఉంటుంది. హైపర్‌టెన్షన్‌తో సతమతమయ్యేవారికి ఇది ఉపయోగపడుతుంది.
స్టామినా
స్టామినా, బలాన్ని కూడా పెంచే శక్తి బీట్‌రూట్ జ్యూస్‌కు ఉంది. ఒక వారం పాటు ప్రతీ రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే అద్భుత ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయ్.
క్యాన్స్‌ర్ నివారణ
బీట్‌రూట్‌లో బెటాలైన్లతో పాటు మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను, హానికర బ్యాక్టీరియాలను ఈ బెటలైన్లు నాశనం చేస్తాయ్. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుంచి బయట పడతారు.
పొటాషియం, నరాలు, కండారాలల్లో బలం
బీట్‌రూట్ జ్యూస్‌లో పొటాషియం పోషకాలు సంమృద్ధిగా ఉంటాయ్. నరాలు, కండరాలు బలంగా ఉండాలంటే శరీరంలో పొటాషియం ఉండాలి. లేదంటే కళ్లు తిరగడం, అలసట, తిమ్మిర్లు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయ్. కాబట్టి పొటాషియం కోసం బీట్‌రూట్ జ్యూస్ తాగాల్సిందే.
ఎన్నో పోషకాలు
తియ్యగా ఉండే బీట్‌రూట్‌లో ఫొలేట్, బేటలైన్లు, పొటాషియంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా ఉన్నాయ్. ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సోడియం, జింక్, కాపర్, సెలెనయం పోషకాలతో పాటు జీర్ణప్రక్రియకు దోహదపడే ఫైబర్ కూడా ఉంటుంది.
ఫ్యాటీ లివర్
లివర్‌పై కొవ్వు పేరుకుపోకుండా బీట్‌రూట్‌లో ఉండే బెటనైన్ కాపాడుతుంది. ఎన్నో పరిశోధనల తరువాత ఈ విషయం బయటపడింది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బీట్‌రూట్ జ్యూస్ తాగాల్సిందే.
వెంటనే ప్రభావం
బీట్‌రూట్ జ్యూస్ తాగిన రెండు గంటల్లోనే శరీరం యాక్టివ్ అవుతంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే తగ్గించి ఆందోళనలను దూరం చేస్తుంది. అప్పటికప్పుడు బలాన్ని ఇచ్చే గ్లూకోండీలా కూడా బీట్‌రూజ్ జ్యైస్ మనకు ఉపయోగపడుతుంది.
బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం
మీడియం సైజ్‌లో ఉన్న ఒక ఫ్రెష్ బీట్‌రూట్‌ను తీసుకోవాలి. పొట్టుతో ఉన్నప్పుడే శుభ్రంగా కడ్డుక్కోవాలి. పీలర్‌తో బీట్‌రూట్‌పైన ఉన్న తొక్కను తీసివాయాలి. చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో లేదా జ్యూస్ బ్లెండర్‌లో గ్రైండ్ చేయాలి. ఇంకా మెత్తగా గ్రైండ్ కావడానికి కొన్ని నీళ్లని కలుపుకోవాలి.
గ్రైండ్ అయిన జ్యూస్‌లో వడకట్టాలి. బట్టతో లేదా వడకట్టే దానితో జ్యూస్‌ను గట్టిగా పొట్టు మిగిలిపోయేలా వడకట్టాలి. జ్యూస్‌ను గ్లాస్‌లో పోసుకున్న తరువాత అందులో నిమ్మకాయను కొద్దిగా పిండుకొని కలుపకొని తాగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











