Latest Updates
-
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది?
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం!
ఈ రోజుల్లో చేసే పనితో సంబంధం లేకుండా అందరి లైఫ్ లు బిజీగా మారిపోయాయి. ఈ బిజీ లైఫ్ లో థైరాయిడ్, మధుమేహం వంటి జీవక్రియ, హార్మోన్ల సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలామంది ఈ వ్యాధులను కేవలం మందులతోనే అదుపు చేయవచ్చని భావిస్తారు.
కానీ మన దైనందిన ఆహారపు అలవాట్లు కూడా ఈ వ్యాధుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని మీకు తెలుసా? సరైన, ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా, హార్మోన్లను సహజంగా సమతుల్యం చేస్తుంది. తద్వారా మన సంపూర్ణ ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది.

ఈ క్రమంలోనే ప్రముఖ న్యూట్రిషన్ అండ్ వెల్ నెస్ నిపుణురాలు ఖుషీ ఛబ్రా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ గురించి వివరించారు. అదే మన వంటగదిలో సులభంగా దొరికే కలోంజీ (నల్ల జీలకర్ర). ఉదయాన్నే పరగడుపున కలోంజీ తీసుకోవడం వల్ల థైరాయిడ్, మధుమేహం వంటి మొండి వ్యాధులు అదుపులో ఉండటమే కాకుండా, బరువు తగ్గడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో అర టీస్పూన్ కలోంజీ గింజల పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలని ఖుషీ ఛబ్రా సూచిస్తున్నారు. అసలు కలోంజీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.
థైరాయిడ్ సమస్యకు సహజసిద్ధమైన చెక్
కలోంజీ గింజల్లో థైమోక్వినోన్(Thymoquinone) అనే అత్యంత శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ (మంటను తగ్గించే) లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి, హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. తరచూ ఈ గింజలను తీసుకోవడం ద్వారా థైరాయిడ్ పనిచేయకపోవడాన్ని సహజ పద్ధతిలో తిప్పికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం నియంత్రణ, బరువు తగ్గుదల
కలోంజీ గింజలు డయాబెటిస్ తో బాధపడేవారికి ఒక వరం లాంటివి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా అధిక బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఇందులోని క్రియాశీలక సమ్మేళనమైన థైమోక్వినోన్.. ఆకలిని నియంత్రించి, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి, కొవ్వు జీవక్రియను వేగవంతం చేయడంలో కలోంజీ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
జుట్టు రాలడానికి బ్రేక్
కాలుష్యం, ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో జుట్టు రాలడం అతిపెద్ద సమస్యగా మారింది. కలోంజీ గింజలు తలమీద చర్మం ఆరోగ్యాన్ని కాపాడతాయి. తలపై మంటను, ఇన్ఫెక్షన్లను తగ్గించి, జుట్టు మూలాలకు లోపలి నుండి పోషణను అందిస్తాయి. దీనివల్ల కురులు రాలడం ఆగిపోయి, జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
రోగనిరోధక శక్తికి బ్రహ్మాస్త్రం
కలోంజీ గింజలను జీవ విత్తనాలు అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ కొన్ని కలోంజీ గింజలను నమలడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి తీవ్రమైన వ్యాధుల వరకు తట్టుకునే బలాన్ని మన శరీరానికి ఇవి అందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
