Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మీ పిల్లలకు విక్స్ రాస్తున్నారా? డాక్టర్ చెప్పిన ఈ ప్రమాదం గురించి తప్పక తెలుసుకోండి!
చిన్న పిల్లలకు జలుబు లేదా దగ్గు వంటివి ఉన్న సమయంలో చాలామంది పేరెంట్స్ వారికి విక్స్ రాయడం చేస్తుంటారు. ఛాతీ దగ్గర, వీపు మీద లేదా అరికాళ్లకి ఇలా ఎక్కడ పడితే అక్కడ విక్స్ రుద్దుతుంటారు. అయితే అసలు ఈ విషయంపై వరంగల్ కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ పసునూతి సుమంత్ తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన కొన్ని విషయాలను షేర్ చేశారు.
ఆ వీడియోలో డాక్టర్ సుమంత్ మాట్లాడుతూ.. ఇటీవల నా దగ్గరికి 8 నెలల పసికందును తీసుకొచ్చారు. ఆ పాప పరిస్థితి చూసి తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఛాతీ, వీపు, అరికాళ్ళు.. ఇలా ఎక్కడ చూసినా ఎర్రటి దద్దుర్లు (Rashes). పాప శరీరం అంతా కమిలిపోయి ఎర్రగా మారిపోయింది.

అయితే ఆ పాపను పరీక్షించి అసలు విషయం తెలుసుకున్నాను.. అసలు కారణం ఏంటంటే జలుబు చేసిందని తల్లిదండ్రులు ఆ చిన్నారికి విపరీతంగా విక్స్ రాసేశారు.. అది వికటించి ఆ చిన్నారి చర్మం అలా తయారైందనని డాక్టర్ సుమంత్ చెప్పారు.
మనం తరచుగా చేసే పెద్ద పొరపాటు ఇదే
మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు వాడే విక్స్ డబ్బానే పిల్లలకు కూడా వాడేస్తుంటారు. కానీ చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా బేబీ విక్స్ ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. 6 ఏళ్ల లోపు పిల్లలకు కేవలం బేబీ విక్స్ మాత్రమే వాడాలి. ఎందుకంటే పెద్దలు వాడే విక్స్ లో కర్పూరం,మెంథాల్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది.
కర్పూరం ఎందుకు ప్రమాదం?
డాక్టర్ల ప్రకారం కర్పూరం చిన్నపిల్లలకు చాలా ప్రమాదకరం. ఇది ఒక న్యూరో టాక్సిన్ అని డాక్టరక్ సుమంత్ చెప్పారు. అంటే ఇది పిల్లల లేత మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, వారికి ఫిట్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.
చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల ఈ రసాయనాలను త్వరగా పీల్చుకుంటుంది.. అందుకే బేబీ విక్స్ లో కర్పూరం అస్సలు ఉండదు, మెంథాల్ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుందని చెప్పారు. కాబట్టి 6 ఏళ్ల వయస్సు లోపు పిల్లలకు బేబీ విక్స్ నే వాడాలని సూచించారు.
ఎక్కడ పడితే అక్కడ పూయకూడదు
చాలామంది అరికాళ్ళకు విక్స్ రాస్తే జలుబు ఇట్టే మాయమవుతుంది అని లేదా వీపు అంతా రుద్దితే ఉపశమనం వస్తుందని నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని డాక్టర్ సుమంత్ తెలిపారు. విక్స్ పని చేయాలంటే దాని నుండి వచ్చే ఆవిరి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళాలని.. కాళ్ళకు రాస్తే ఆ వాసన ముక్కు దాకా ఎలా వస్తుంది? అది ఉపయోగం లేని పని అని అన్నారు.
పిల్లల వీపు మీద విక్స్ రుద్దడం వల్ల, వారికి చెమట పట్టినప్పుడు ఆ చెమట మరియు విక్స్ కలిసి రియాక్షన్ జరిగి చర్మంపై తీవ్రమైన దద్దుర్లు వస్తాయన్నారు.
సరైన పద్ధతి ఇదే
విక్స్ ను కేవలం ఛాతీ మీద మాత్రమే, అది కూడా చాలా పల్చటి పొరలా మాత్రమే రాయాలని సూచించారు. అప్పుడు ఆ ఆవిరి ముక్కుకు చేరి ఉపశమనాన్ని ఇస్తుంది. మందంగా పూయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
విక్స్ జలుబును తగ్గిస్తుందా?
నిజం చెప్పాలంటే.. విక్స్ జలుబును తగ్గించదని డాక్టర్ సుమంత్ అన్నారు. జలుబు వైరస్ వల్ల వస్తుంది, అది తగ్గాల్సిన సమయం తీసుకునే తగ్గుతుందన్నారు.
మరి విక్స్ ఏం చేస్తుంది?
విక్స్ నుండి వచ్చే ఘాటైన వాసన ముక్కులోని నరాలను తాకినప్పుడు, మెదడుకు వెళ్ళే సిగ్నల్స్ డైవర్ట్ అవుతాయి. అంటే ముక్కు దిబ్బడ వల్ల కలిగే అసౌకర్యాన్ని మెదడు కాసేపు మర్చిపోయేలా చేసి, నాకు గాలి బాగా ఆడుతోంది అనే ఒక రాంగ్ సంకేతాన్ని (తాత్కాలిక ఉపశమనం) మాత్రమే ఇస్తుంది.. అంతేకాని జలుబును ఇది మ్యాజిక్ లా మాయం చేయదని డాక్టర్ సుమంత్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











