Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
Always Hungry: ఎప్పుడూ నోరు ఆడిస్తూనే ఉన్నారా? ఎంత తిన్నా ఇంకా ఆకలేస్తుందా?
ఎంత తిన్న ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది? ప్రతి 5, 10 నిమిషాలకోసారి ఏదైనా తినాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది? ఇలా అనిపించడం వెనక కారణాలు ఏంటో వాటి పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు ఎప్పుడూ నోరు ఆడిస్తూనే ఉంటారు. అంటే ఏదో ఒకటి తింటూనే ఉంటారు. కడుపు నిండి భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కొంత మందికి. కొందరైతే ఎప్పుడూ ఆకలితోనే ఉంటారు. తరచూ ఏదో ఒకటి తినాలనిపించే దానిని ఆల్వేస్ హంగ్రీగా పేర్కొనవచ్చు.
అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఎంత తిన్న ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది? ప్రతి 5, 10 నిమిషాలకోసారి ఏదైనా తినాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది? ఇలా అనిపించడం వెనక కారణాలు ఏంటో వాటి పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తగినంత ప్రోటీన్ తినకపోవడం
ప్రోటీన్లు ఆకలిని తగ్గిస్తాయి. ప్రోటీన్లు శరీరంలోపలికి వెళ్లగానే కడుపు నిండిన భావన కలిగే హార్మోన్లు ఉత్పత్తి కావడాన్ని ప్రేరేపిస్తాయి. అలా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
తక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఆకలిగా అనిపిస్తుంది. తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్ల వంటివి తినాలి.
2. తగినంత నిద్రలేకపోవడం
మెదడు పనితీరుకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు సరైన నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. తగినంత నిద్రలేకపోవడం వల్ల ఆకలి ఎక్కువవుతుంది. కంటినిండా నిద్రపోవడం వల్ల ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది.
3. రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువగా తినడం
ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు ఎంత ఎక్కువగా తిన్నా కడుపు నిండిన భావన కలగదు. రిఫైన్డ్ ఫుడ్స్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తొలగించబడతాయి. అందువల్ల ఆకలి ఏమాత్రం తగ్గదు. మైదా పిండి, బ్రెడ్, పాస్తా, చక్కెర పానీయాలు, సోడా, స్వీట్లు, ప్యాకెజ్డ్ ఫుడ్స్ అన్ని ఆకలిని పెంచుతాయి.
4. తక్కువ కొవ్వున్న ఆహారాలు తినడం
కడుపు నిండుగా ఉంచడంలో కొవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత కొవ్వు తీసుకోకపోతే శరీరానికి మంచి ఫ్యాట్ అందదు. కొవ్వు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి కొవ్వులు తీసుకోవాలి.
5. తగినంత నీరు తాగకపోవడం
శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా కీలకం. శరీరంలో తగినంత నీరు ఉంటేనే అన్ని శరీర క్రియలు సాఫీగా, సవ్యంగా జరుగుతాయి. తినడానికి కొద్ది సమయం ముందు నీరు తాగడం ద్వారా తక్కువగా తినడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

6. ఫైబర్ తీసుకోకపోవడం
ఆహారంలో ఫైబర్ కీలకం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే కడుపు ఎక్కువ సేపు నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది. తక్కువ ఫైబర్ తీసుకుంటే అరుగుదల వేగం పెరిగి కడుపు త్వరగా ఖాళీ అయిపోతుంది. దీని వల్ల ఆకలి వేస్తుంది.
అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తింటూ ఉండాలి. దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది.
7. ఎక్కువగా మద్యం తాగితే
ఆకలి స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ లను ఆల్కహాల్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ ఆకలిని తగ్గించే లెఫ్టిన్ వంటి హార్మోన్లను నిరోదిస్తుంది. అందుకే ఎక్కువ ఆల్కహాల్ సేవిస్తే ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది.
8. ఒత్తిడి ఎదుర్కొంటుంటే
ఒత్తిడి & ఆకలి మధ్య గల సంబంధాలు కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. శరీరం ఒత్తిడికి గురయినప్పుడు అడ్రినలిన్ & కర్టిసోల్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎన్నో ఇతర కారణాలు అడ్రినలిన్ ఉత్పాదకతను మరింత తీవ్రంగా పెంచడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది.
9. కొన్నిరకాల మందులు తీసుకుంటే
కొన్ని రకాల మందులు ఆకలిని పెంచుతాయి. క్లోజాపైన్, ఒలాన్జాపైన్ వంటి యాంటీసైకోటిక్స్, యాంటిడిప్రెసెంట్స్, మూడ్ స్టెబిలైజర్లు, కార్టికోస్టెరాయిడ్స్, యాంటిసైజర్ డ్రగ్స్ వల్ల ఆకలి వేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications