Latest Updates
-
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా..
మఖానా vs వేయించిన శనగలు..బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ప్రస్తుతం మనదేశంలో లక్షలాది మంది ప్రజలు ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన మన దేశీయ స్నాక్స్ వైపు ప్రజల దృష్టి మళ్లింది.
ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు అద్భుతమైన స్నాక్స్..మఖానా,వేయించిన శనగలు. ఈ రెండూ పోషకాల గనులు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటే మంచిది? దేని ప్రయోజనాలు ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

మఖానా అంటే ఏమిటి?
పట్టణాల్లో మఖానాను ఒక ప్రీమియం హెల్త్ స్నాక్ గా ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరకరలాడుతూ ఉండే ఈ తామర గింజలను తినడానికి అందరూ ఇష్టపడతారు. అయితే కృత్రిమ ఫ్లేవర్స్ లేదా ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాకెట్స్ కాకుండా.. ఇంట్లోనే కొద్దిగా నెయ్యి, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకుని తింటే దీని అసలు ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
మఖానాలో కేలరీలు చాలా తక్కువ. ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉండి ఎముకలను దృఢపరుస్తాయి. ఇది కడుపుకు చాలా తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది.
వేయించిన శనగలు అంటే ఏమిటి?
మఖానాతో పోలిస్తే పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటు ధరలో దొరికే అత్యుత్తమ స్నాక్ కాల్చిన శనగలు.
ఇవి ఫైబర్ (పీచు పదార్థం), ప్రోటీన్ కు పవర్ హౌస్ లాంటివి. శనగలను వేయించడం వల్ల అందులోని ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుందని, మినరల్స్ ని శరీరం వేగంగా గ్రహిస్తుందని సైన్స్ చెబుతోంది. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే ఉద్యోగులకు, విద్యార్థులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావనను ఇస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను రక్షించడంలో శనగలు ముందుంటాయి.
పోషకాల పోలిక (ప్రతి 100 గ్రాములకు)
మఖానా: 350 కేలరీలు, 11-12 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల ఫైబర్, 0.5 - 1 గ్రాము కొవ్వు ఉంటుంది.
కాల్చిన శనగలు: 360 కేలరీలు, 19-20 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల ఫైబర్, 5-6 గ్రాముల కొవ్వు ఉంటుంది.
నూనె లేదా నెయ్యి వాడకాన్ని బట్టి కొవ్వు శాతం మారవచ్చు.
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
బరువు తగ్గే ప్రయాణంలో ఈ రెండూ మంచిదే. ఏది బెస్ట్ అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అవసరంపై ఆధారపడి ఉంటుంది. మీరు తక్కువ కేలరీలతో, తేలికపాటి స్నాక్ తినాలనుకుంటే మఖానా బెస్ట్. ఇది మీ బరువును అదుపులో ఉంచుతూనే మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది.
అలా కాకుండా ఒకసారి తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండాలి, మీ శరీరానికి ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ కావాలి అనుకుంటే వేయించిన శనగలు బెస్ట్ ఆప్షన్. ఇది జంక్ ఫుడ్ తినాలనే కోరికను చంపేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
