Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Coconut Water Side Effects: ఎండాకాలం కొబ్బరినీళ్లు మంచివని తెగ తాగేస్తున్నారా? రోగాలొస్తాయి జాగ్రత్త!
కొబ్బరి నీళ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే కొబ్బరి నీటిని మ్యాజిక్ డ్రింక్ లేదా నేచర్స్ డ్రింక్ అని పిలుస్తుంటారు. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండొచ్చు.
అయితే అతి ఎప్పుడూ మంచిది కాదని పెద్దలు చెప్పే మాట. కొబ్బరి నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతిగా తాగితే రోగాల బారిన పడాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొబ్బరి నీటిని ఎక్కువగా తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డయేరియా రావొచ్చు
కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై లగ్జేటివ్ ప్రభావం పడుతుంది. కొబ్బరి నీరు సహజ భేది మందు కాబట్టి ప్రేగు కదలికల్లో సమస్యలు వస్తాయి. దీని వల్ల డయేరియా రావొచ్చు.
2. అథ్లెట్లకు సరైనది కాదు
వర్కవుట్స్ చేసే వారు హైడ్రేటెడ్ గా ఉండటానికి కొబ్బరి నీటిని తాగొద్దు. దానికి బదులు మంచి నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కొబ్బరి నీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని స్పోర్ట్స్ ఎనర్జీ డ్రింక్స్ తో పోలిస్తే కొబ్బరి నీటిలో కార్బొహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
3. వారికి రక్తంలో చక్కెర పెరుగుతుంది
రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర పెరుగుతుంది. మూత్రవిసర్జన పెరుగుతుంది. రాత్రి పూట బాత్రూముకు నిరంతరం వెళ్లాల్సి వస్తుంది. దాని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
4. ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది
కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అయితే పొటాషియం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడంవల్ల హైపర్ కలేమియా ఏర్పడి స్పృహ కోల్పోవచ్చు.
5. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగొచ్చు
కొబ్బరి నీళ్లలో కార్బొహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. అధిక రక్త చక్కెర ఉన్న వ్యక్తులు రోజుకు ఒక గ్లాసు కంటే ఎక్కువ తాగకూడదు.
6. బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించవచ్చు
కొబ్బరి నీరు రక్తపోటును తగ్గించవచ్చు. ఇప్పటికే అధిక రక్తపోటు కోసం మందులు తీసుకుంటుంటే రక్తపోటు తగ్గడానికి కారణం కావొచ్చు.
7. కిడ్నీ సమస్యలున్న వ్యక్తులకు సమస్యలు తీసుకురావొచ్చు
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి(CKD) ఉన్న వారు కొబ్బరి నీటిని తీసుకోవద్దని వైద్యులు సూచిస్తుంటారు. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం కంటెంట్ హైపర్‌కలేమియాకు కారణమవుతుంది. మూత్రపిండాల రోగుల్లో అధిక పొటాషియం తీసుకోవడం వల్ల ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications