Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Weight Loss Tips: ఉల్లిపాయతో బెల్లీ ఫ్యాట్ కు గుడ్ బై చెప్పండిలా..!
బరువు తగ్గాలనుకునే వాల్లు ముందుగా తగ్గించుకోవాల్సింది నడుము చుట్టూ ఉన్న కొవ్వునే. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్లే అనేక సమస్యలు వస్తుంటాయి. దీన్ని తగ్గించుకోవాలనుకుంటే మీ ఆహారంలో కొవ్వు పదార్థాలను వీలైనంత వరకు దూరం చేయాలి.
అప్పుడే బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. డైట్ ఫాలో అవ్వడం కంటే కూడా కొన్ని అహార పదార్థాలను రోజువారీ ఆహరంలో వాడితే చాలా లాభాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఉల్లిపాయ.

బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది:
ఉల్లిపాయను చాలా మంది రోజువారీ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. కానీ అధిక బరువు ఉన్న చాలా మంది ఉల్లికి అలవాటు పడినప్పటికీ బరవులో చెప్పుకోదగ్గ మార్పు కనిపించదు. ఉల్లిపాయలను సరిగ్గా తినకపోవడమే ఇందుకు ఒక కారణం. బరువు తగ్గడానికి ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు కరిగే ఫైబర్ యొక్క గొప్పమూలం. వాటిని శక్తివంతమైన ప్రీబయోటిక్ ఆహారంగా మారుస్తుంది. ఉల్లి కడుపు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది బరువు తగ్గడం మరియు బొడ్డు కొవ్వు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఉల్లిపాయలో పుష్కలంగా పోషకాలు:
ఉల్లిపాయను సూప్ లేదా రసం రూపంలో తీసుకుంటే చాలా ఉపయోగాలు పొందవచ్చు. ఈ రసాన్ని సలాడ్లు, ఫ్రూట్స్ లలో వాడడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలో 64 కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.16 గ్రాముల కొవ్వు, 2.7 గ్రాముల ఫైబర్, 1.76 గ్రాముల ప్రోటీన్, 6.78 గ్రాముల చక్కెర, విటమిన్ సి, విటమిన్ బి, B6 మరియు మాంగనీస్ ఉంటాయి. అలాగే ఉల్లిపాయల్లో కాల్షియం, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు పొటాషియం, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ వంటి చిన్న మొత్తంలో ఉంటాయి.
ఉల్లిరసం తయారీ విధానం:
కావలసినవి: ఒక తాజా ఉల్లిపాయ, 3 కప్పుల నీరు. ముందుగా ఉల్లిపాయ తొక్కను తొలగించి.. ఒక కప్పు నీరు వేసి మరిగించాలి. 4 నిమిషాల తర్వాత ఉల్లిపాయను తీసేసి దానిని బ్లెండర్ కు బదిలీ చేయాలి. దీనికి రెండు కప్పుల మరో రెండు కప్పుల నీరు కలపి ఈ రసాన్ని గ్లాసులో పోసుకుని తాగాలి.
ఉల్లిపాయ సూప్ తయారీ విధానం:
కావలసిన వస్తువులు: 6 పెద్ద ఉల్లిపాయలు, 3 తరిగిన టమోటాలు, 1 కప్పు క్యాబేజీ, వెల్లుల్లి యొక్క 2 లవంగాలు, అల్లం (కావాలనుకుంటే), 1 టీస్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె, ఉప్పు అవసరానికి సరిపడా.
ఒలిచిన ఉల్లిపాయను ముక్కలు చేసుకోవాలి. ఒక కుండలో ఆలివ్ నూనెను వేడి చేసి, అల్లం మరియు వెల్లుల్లిని వేయాలి. రెండు నిమిషాలు వేగాకా.. ఉల్లిపాయ మరియు ఇతర కూరగాయలను వేసి 30 సెకన్ల పాటు ఉడికించాలి. ఆ తర్వాత మిరియాలు మరియు ఉప్పు వేయాలి. 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారాకా తాగాలి.
ఉల్లిపాయ రసం, సూప్ వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజూ ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. రోజూ ఉల్లిపాయను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడంలో ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొవ్వును తగ్గించడం, క్యాన్సర్ కణాలను నివారించడంలో కూడా ఉల్లిపాయ ముందుంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications