Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
Myths And Facts: బరువు తగ్గాలనుకుంటున్నారా? వీటి గురించి ఎవరు చెప్పినా నమ్మొద్దు, అవన్నీ అపోహలే!
మంచి ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ వ్యాయామం చేయకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, జీవనశైలి అలవాట్ల వల్ల బరువు పెరిగి, పొట్ట ముందుకు తన్నుకువచ్చి చిన్నపాటి లాఫింగ్ బుద్ధలా కనిపిస్తారు చాలా మంది. కొందరు ఎట్టిపరిస్థితుల్లో బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. జిమ్‌కు వెళ్లడం, డైట్ పాటించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వారికి బరువు ఎలా తగ్గాలో అని చిట్కాలు ఇచ్చే వారు చాలా మందే ఉంటారు. అది చేయాలి, ఇది చేయాలి అంటుంటారు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, అలాగే చాలా వరకు అపోహలు ఉంటాయి.
మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నా.. బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నా.. ఎదుటివారు చెప్పే వాటిలో అపోహలు ఏంటో, వాస్తవాలు ఏంటో తెలుసుకోవడం మంచిది. మరి తెలుసుకుందామా..

బరువు తగ్గడానికి ఆకలిని చంపుకోవాలి!
ఆకలిని చంపుకోవడం ఎప్పటికీ సరైనది కాదు. ఒక పూట, రెండు పూటలు ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఎక్కువగా తినేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా చిన్న చిన్న భాగాలుగా తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే తినేది ఏదైనా పోషకాహారమై ఉండేలా జాగ్రత్త పడాలి.
వ్యాయామం చేస్తున్నా కాబట్టి ఎంతైనా తినొచ్చు!
కేలరీలు తీసుకోవడాన్ని తగ్గించాలి, అలాగే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలి అప్పుడే బరువు తగ్గుతారు. చెమటోడ్చి వ్యాయామం చేసి కొవ్వు కరిగించిన తర్వాత ఇష్టమొచ్చినట్లుగా తింటే మళ్లీ కేలరీలు శరీరానికి అందుతాయి. దీని వల్ల బరువు తగ్గడం జరగదు. క్రమం తప్పని వ్యాయామం, తక్కువ మొత్తంలో కేలరీలు తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
పుష్కలంగా నీరు తాగితే బరువు తగ్గవచ్చు!
నీరు తాగితే బరువు తగ్గలేరు. అయితే పుష్కలంగా నీరు తాగడం వల్ల బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. పాలు, కూల్‌డ్రింక్స్, పండ్ల రసాలలో కేలరీలు ఉంటాయి. నీటిలో కేలరీలు ఉండవు. వాటికి బదులు నీటిని తాగడం మంచిదే. అలాగే భోజనానికి కొద్దిగా ముందు ఒకటీ రెండు గ్లాసుల నీరు తాగితే ఆహారం తక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు!
ఆల్కహాల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీర్, వైన్, విస్కీ అన్నింటిలో కేలరీలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడం మంచిది. లేదంటే కనీసం నియంత్రణలో అయినా ఉంచుకోవాలి.
బరువు తగ్గడానికి ఫైబర్ పుష్కలంగా తినాలి!
బరువు తగ్గడంలో ఫైబర్ ది కీలక పాత్ర. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అందుకే ఆహారం ఫైబర్ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అతి ఎక్కడా పనికి రాదు. ఎక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అరగకపోవడం, మలబద్ధకం లాంటివి ఎదురవుతాయి. కాబట్టి పరిమితికి మించి ఏదీ తినకూడదు, తాగకూడదు.
ఉపవాసం ఉంటే బరువు తగ్గవచ్చు!
ఉపవాసం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే సగం రోజు, పూర్తి రోజు ఉపవాసం వరకు ఎలాంటి సమస్యా లేదు. అంతకుమించితే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలసట, మైకం, వికారం, రక్తపోటు తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఉపవాసం వల్ల బరువు తగ్గుతారు అనేది వాస్తవం కాదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications