Latest Updates
-
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే..
గుండె దడ గ్యాస్ వల్లేనా? లేక యాంగ్జైటీనా? తేడాను ఇలా గుర్తించండి
మనో చాలామంది తాము అనుభవించే చిన్న చిన్న శారీరక ఇబ్బందులను సాధారణ సమస్యలే కదా అని లైట్ తీసుకుంటారు. ముఖ్యంగా సడెన్ గా గుండె దడగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా కూడా ఇది గ్యాస్ ట్రబుల్ మాత్రమే లైట్ గా తీసుకుంటుంటారు లేదా సొంత వైద్యంతో సోడా తాగడమో, ట్యాబ్లెట్స్ వేసుకోవడమో చేస్తారు.
కానీ వైద్య నిపుణుల హెచ్చరిక ప్రకారం.. మీరు భావిస్తున్నట్లు అది కేవలం గ్యాస్ సమస్య కాకపోవచ్చు.. తీవ్రమైన ఆందోళన లేదా గుండె సంబంధిత సమస్యలకు అది సంకేతం కావొచ్చు. లక్షణాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా సొంత ట్రీట్మెంట్ చేసుకోవడం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అసలు ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ లేదా అజీర్ణం లక్షణాలు ఎలా ఉంటాయి?
నిపుణుల ప్రకారం గ్యాస్ సమస్య ప్రధానంగా జీర్ణక్రియకు సంబంధించింది.
-కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం.
-ఎక్కువగా త్రేనుపులు రావడం.
-కడుపులో నొప్పి లేదా తిమ్మిరిగా అనిపించడం.
-ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత ఈ సమస్యలు తలెత్తుతాయి.
-సాధారణంగా యాంటాసిడ్లు తీసుకోవడం లేదా హోం రెమెడీస్ తో ఇవి తగ్గుముఖం పడతాయి.
ఆందోళన లేదా యాంగ్జైటీ లక్షణాలు ఏమిటి?
ఇది మానసిక ఒత్తిడి లేదా ఆకస్మిక భయం వల్ల వస్తుంది. దీనికి మనం తీసుకున్న ఆహారంతో ప్రత్యక్ష సంబంధం ఉండదు.
-గుండె వేగంగా కొట్టుకోవడం (దడ), ఛాతీలో ఒత్తిడి.
-ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడం.
-విపరీతంగా చెమటలు పట్టడం, చేతులు-కాళ్లు వణకడం.
-తల తిరగడం లేదా కళ్లు బైర్లు కమ్మడం.
-గ్యాస్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఈ లక్షణాలు తగ్గవు
ఈ రెండింటి మధ్య ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది?
చాలామంది ఈ రెండింటినీ వేరు చేయలేకపోవడానికి ప్రధాన కారణం లక్షణాలు ఒకేలా ఉండటం.
ఛాతీలో నొప్పి
గ్యాస్ పేలికవల్ల ఛాతీ మధ్యలో బరువుగా అనిపిస్తుంది. ఆందోళనలో కూడా ఛాతీని ఎవరో గట్టిగా పిండేస్తున్నట్లు అనిపిస్తుంది.
శ్వాసలో ఇబ్బంది
కడుపు ఉబ్బినప్పుడు డయాఫ్రమ్ పై ఒత్తిడి పడి శ్వాస ఆడదు. అలాగే ఆందోళనలో కూడా వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల ఆయాసంగా అనిపిస్తుంది.
ఆకస్మికత
ఈ రెండు సమస్యలూ అకస్మాత్తుగా దాడి చేస్తాయి. అందుకే ఏది గ్యాస్, ఏది ఆందోళన అని గుర్తించడం కష్టమవుతుంది. కొన్నిసార్లు గుండెపోటు లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి మరింత గందరగోళం నెలకొంటుంది.
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
-ఛాతీ నొప్పి 15-20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటే.
-ఆ నొప్పి ఎడమ చేతికి, దవడకు లేదా వీపుకు పాకుతుంటే.
-విపరీతమైన వాంతులు, తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం జరిగితే.
తిన్న తర్వాత కడుపులో మంటగా, బరువుగా అనిపిస్తే అది గ్యాస్ కావొచ్చు. కానీ, ఎటువంటి కారణం లేకుండా హఠాత్తుగా భయం, విశ్రాంతి లేకపోవడం, గుండె దడ వస్తుంటే అది ఆందోళన లేదా ఇతర గుండె సంబంధిత సమస్య కావొచ్చు. సందేహంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించడమే అన్ని విధాలా శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications