Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నిద్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా? మీకు నిద్ర సరిపోయిందా..
మనిషికి నిద్ర చాలా అవసరం. నిద్ర పోవడం వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది. రోజంతా పడిన కష్టానికి నిద్ర ద్వారా విశ్రాంతి దొరకడమే కాకుండా శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే అది మానసికంగా, శారీరకంగా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఒక్క రోజు రాత్రి నిద్రపోకపోయినా నీరసంగా, ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, యాక్టివ్ గా ఉండటానికి, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కీలకం.

ఆహారం, వ్యాయామం, నీటితో పాటు మనిషి నిద్ర కూడా చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే మర్నాడు రోజంతా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి ఏ వయస్సు వాళ్లు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నవజాత శిశువులు(మొదటి 3 నెలలు):
నవజాత శిశువులకు ఎక్కువ నిద్ర అవసరం. సాధారణంగా రోజుకు 14-17 గంటలు శిశువులు నిద్ర పోవాలి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటి వాతావరణానికి శిశువు చాలా వేగంగా అలవాటు పడుతుంది. శరీరం చాలా సమాచారాన్ని సేకరిస్తుంది. ఇంతటి సమాచారాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి శరీరానికి శక్తి, విశ్రాంతి అవసరం.
శిశువులు(4-11 నెలలు):
శిశువులకు చాలా నిద్ర అవసరం. నవజాత శిశువులతో పోలిస్తే 2 గంటల వరకు తక్కువే నిద్రపోతుంటారు. అంటే రోజుకు 12 నుంచి 15 గంటల పాటు శిశువులు నిద్ర పోవాలి. రోజులో కాసేపు ఆడుకుని, రాత్రంతా నిద్రపోతారు.
పసిపిల్లలు(1-2 సంవత్సరాలు):
పసి బిడ్డలకు నిద్ర పోయే సమయం తగ్గుతూ వస్తుంది. రోజుకు 11-14 గంటలు నిద్ర పోవాల్సిందే. పసి బిడ్డలు పగటి పూట నిద్రపోతారు. అలాగే రాత్రంతా నిద్రపోతారు.
ప్రీస్కూలర్లు(3-5 సంవత్సరాలు):
ప్రీస్కూలర్లకు రోజుకు 10-13 గంటల నిద్ర అవసరం. వారు 3-5 సంవత్సరాల వయస్సు పిల్లలు కూడా పగటి పూట నిద్రపోతుంటారు. కానీ వారు పెద్దయ్యే కొద్దీ తక్కువగా నిద్రపోతుంటారు.
పాఠశాల వయస్సు పిల్లలు (6-12 సంవత్సరాలు):
పాఠశాల వయస్సు పిల్లలకు రోజుకు 9-11 గంటల నిద్ర అవసరం. వారు తర్వాత పడుకోవడం, మేల్కోవడం ప్రారంభించవచ్చు. కానీ వారు పాఠశాలలో, ఇంట్లో యాక్టివ్ గా ఉండటానికి తగినంత శక్తి కావాలి. ఆ శక్తి కోసం నిద్ర పోవాలి.
యువకులు (13-18 సంవత్సరాలు):
టీనేజర్లకు రోజుకు 8-10 గంటల పాటు నిద్ర అవసరం. అయినప్పటికీ చాలా మంది యువకులు తగినంత నిద్ర పోరు. కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల అలసట, ఏకాగ్రత కష్టం, మానసిక కల్లోలం వంటి సమస్యలకు దారితీస్తుంది.
పెద్దలు (18-64 సంవత్సరాలు):
పెద్దలకు రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం. అయినప్పటికీ కొంతమంది పెద్దలకు వారి వ్యక్తిగత అవసరాలను బట్టి ఎక్కువ లేదా తక్కువ నిద్ర అవసరం కావొచ్చు.
పెద్దలు (65+ సంవత్సరాలు):
వృద్ధులకు తక్కువ నిద్ర సరిపోతుంది. అంటే కనీసం 7-8 గంటలు నిద్ర పోవాలి. అయితే కొంత మంది వృద్ధులకు ఎక్కువ నిద్ర అవసరం కావొచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మరింత ఎక్కువ నిద్ర అవసరం కావొచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications