Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
Fruits in Fridge: ఫ్రిడ్జ్ లో పొరపాటున కూడా పెట్టకూడని పండ్లు ఇవే..పెట్టారంటే విషంగా మారిపోతాయ్!
ధారణంగా చాలామంది ఇళ్లల్లో వంటగదిలో మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్ లో తోసేస్తుంటారు.ఫ్రిడ్జ్ లో పెట్టకూడనివి కూడా అందులో తోసేస్తుంటారు. అయితే ఇదే సమయంలో చాలామంది కొన్ని రోజులకు సరిపడా ఫ్రూట్స్ లేదా పండ్లు తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. అయితే మీరు కూడా ఇలా చేస్తుంటే వెంటనే ఈ అలవాటు మానేయడం ఉత్తమం. మనం తెలియక చేసే ఈ చిన్న పొరపాటే మన్నలి హాస్పిటల్ పాలు చేసే అవకాశం ఉంటుంది.
పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ మనం తినే పండ్లు నిజంగా తాజాగా ఉన్నాయా లేదా కోల్డ్ స్టోరేజ్‌లోంచి వచ్చి డైనింగ్ టేబుల్‌పైకి చేరాయా అన్నది చాలా ముఖ్యం. అన్ని పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు. తాజాదనం కోసం మనం చేసే ఈ ప్రయత్నం కొన్నిసార్లు పండ్ల సహజ గుణాలను, పోషకాలను దెబ్బతీసి, వాటిని రుచిహీనంగా మార్చేస్తుంది. కొన్ని పండ్లు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి సహజత్వాన్ని కోల్పోయి చివరికి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఫ్రిడ్జ్ లో పొరపాటున కూడా పెట్టకూడని పండ్లు ఏవో ఇక్కడ చూడండి.

ఏయే పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు
యాపిల్స్
చాలా మంది యాపిల్స్‌ను కొన్న వెంటనే ఫ్రిజ్‌లో పెడతారు. కానీ యాపిల్స్ ను ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా మెత్తబడతాయి. అవి తమ సహజమైన కరకరలాడే గుణాన్ని కోల్పోయి, మెత్తగా పిప్పిలా మారతాయి. ఫ్రిజ్‌లోని చల్లదనం వాటి సహజ రుచిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కొద్దిగా పచ్చిగా ఉన్న యాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడితే అది సరిగా పండక ముందే పాడైపోతుంది.
మామిడి పండ్లు
మామిడికాయను పండ్లలో రారాజు అని పిలుస్తాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడికాయ ఉండని తెలుగు ఇళ్లు ఉండదంటే ఆశ్చర్యపోనక్కర్లుదు. చాలామంది ఒకేసారి ఎక్కువ మామిడికాయలను ఇంటికి తెచ్చుసుకుంటారు. అయితే ఇదే సమయంలో ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని ఆశపడి మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఇది వాటి రుచిని దారుణంగా దెబ్బతీస్తుంది. ఫ్రిజ్‌లోని చల్లదనం మామిడి సహజ మాధుర్యాన్ని తగ్గించేస్తుంది. పచ్చి కాయలను ఫ్రిజ్‌లో పెడితే అవి పండనే పండవు. కాబట్టి మామిడి పండ్ల అసలైన రుచిని ఆస్వాదించాలంటే గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం ఉత్తమం.
పైనాపిల్
పైనాపిల్ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దాని సహజమైన తీపి, రసం తగ్గిపోయి చప్పగా తయారవుతుంది. అయితే పైనాపిల్‌ను ముక్కలుగా కోసిన తర్వాత మాత్రం గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
నారింజ
నారింజ పండ్లను కూడా ఎక్కువకాలం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు. కొద్దిసేపు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కానీ ఎక్కువ కాలం ఉంచితే వాటిలోని పోషకాలు, సహజమైన పుల్లటి తీపి రుచిని కోల్పోతాయి. ఫ్రిజ్ కు బదులుగా ఇంట్లోని ఏదైనా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచితే అవి ఫ్రెష్ గా ఉంటాయి.
బొప్పాయి
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చిగా ఉన్న బొప్పాయిని ఫ్రిజ్ లో పెడితే అది ఎప్పటికీ పండదు. ఇక బాగా పండిన బొప్పాయిని ఫ్రిజ్ లో ఉంచితే దాని రుచి మారిపోతుంది. కోసిన బొప్పాయి ముక్కలను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు కానీ పండు మొత్తాన్ని మాత్రం పెట్టకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











