Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడితే..శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసా?
స్మార్ట్ ఫోన్ కూడా మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయువంలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక చాలామంది పక్కన ఉనన, ఎదురు ెున్న మనుషులతో మాట్లాడటం మానేశారు. పక్కన ఉన్నోళ్లతో కూడా ఫోన్ లో మేసేజ్ లు పెట్టి పలకరిస్తున్నారు. పొద్దున లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఫోనే సర్వసం అయిపోయింది చాలామంది. ఒక్క రోజు ఫోన్ లేకుంటే చాలా మందికి పిచ్చి ఎక్కిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రోజు మొత్తం మనతోనే ఉండే ఈ ఫోన్ రాత్రిపూట మన ప్రశాంతత దొంగలించే ఓ సైలెంట్ కిల్లర్ గా మారుతోందని మీకు తెలుసా?
పగలంతా అలసిపోయి రాత్రిపూట మంచం ఎక్కాక దుప్పటి కప్పుకుని మనలో చాలామంది చేసే మొదటి ఫని ఫోన్ చేతిలోకి తీసుకోవడం. వాట్సాప్,ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో స్క్రోలింగ్, రాత్రిళ్లు వచ్చే మెసేజ్ లకు రిప్లై ఇవ్వడాలు,నిద్రను మైమరిపించే వీడియోలు ఇదొక వ్యసనంలా మారిపోయింది. కానీ అసలు ఈ అలవాటు మన కంటి నిండా నిద్ర లేకుండా చేసి మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతోందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. రాత్రిళ్లు నిద్రకు ముందు ఫోన్ వాడితే మన శరీరంలో ఏమవుతుందో ఇక్కడ చూడండి.

బ్లూ లైట్ డేంజర్
ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన ఆరోగ్యానికి మెయిన్ విలన్. ఈ నీలి కాంతి మన మెదడును పగటి సమయం అని భ్రమింజేస్తుంది. దీంతో మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే నేచురల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా నిద్రపట్టడం లేట్ అవ్వడమే కాకుండా గాఢ నిద్రకు ఆటంకం కలుగుతుంది. మీరు నిపుణులు చెప్పినట్లు 8 గంటలు పడుకున్నప్పటికీ పొద్దున్నే లేవగానే అలసటగా,నీరసంగా అనిపించడానికి కారణం ఇదే.
శరీరంపై దాడి, మనసుపై వేటు
నిద్రపోయే ముందు ఫోన్ వాడకం కేవలం నిద్రను పాడుచేయడమే కాకుండా మన శరీరం,మనసుపై ఒక చైన్ ఎఫెక్ట్ చూపుతుంది.
కంటి ఆరోగ్యంపై ప్రభావం: అధిక సమయం ఫోన్ స్క్రీన్ ను చూడటం వల్ల కళ్లు పొడిబారడం, దురద,మంటలు, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
మానసిక ఒత్తిడి: సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూ మనల్ని మనం పోల్చుకోవడం వల్ల తెలియని ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి.
మెదడుకు అశాంతి: నిద్రపోయే ముందు కూడా మెదడుకు విశ్రాంతి లభించదు. దాని పనితీరు మరుసటి రోజు మందగిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత లోపించడం,జ్ణాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
దీర్థకాలిక రోగాలు: దీర్ఘకాలిక నిద్రలేమి.. హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్, హై బీపీ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.ఆకలిని నియంత్రించే హార్మోన్లపై కూడా ప్రభావం పడి బరువు పెరగగానికి కారణమవుతుంది.
పరిష్కారం ఇదే
నిద్రపోడానికి కనీసం అరగంట నుంచి గంట ముందు ఫోన్ ను పక్కన పడేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఆ సమయాన్ని డిజిటల్ సన్ సెట్ గా భావించి బుక్స్ చదవడం,మ్యూజిక్ వినడం,కుటుంబ సభ్యులతో మాట్లాడం లేదా ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications