Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
మహిళల్లో పెరుగుతున్న హార్ట్ బ్లాక్..ఇలా చేయకుంటే మరణం తప్పదు!
గుండెజబ్బులు కేవలం మగవాళ్లకే వస్తాయి..ఆడవాళ్లకి రావు..ఎందుకంటే ఆడవాళ్లకు హార్ట్ ఉండదు కదా అని తరుచుగా సరదాగా అంటుంటారు. దీనిపైన సోషల్ మీడియాలో కూడా మీమ్స్, పోస్టులు, కామెంట్స్ కనబడుతుంటాయి. ఇదిలా ఉంటే చాలామందిలో ఉండే అపోహ కూడా ఏంటంటే..గుండె జబ్బులంటే కేవలం మగవాళ్లకే వస్తాయని. అయితే ఇలా మీరు కూడా అనుకుంటే పొరబడినట్లే. ఆధునిక జీవనశైలి, మన చిన్న చిన్న అలవాట్లు, నిర్లక్ష్యం మన ఆరోగ్యానికి ముఖ్యంగా మహిళల గుండెకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని నిపుణులుహెచ్చరిస్తున్నారు. కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD), అంటే గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం, నేడు భారతీయ మహిళల మరణాలకు ఒక ప్రధాన కారణంగా మారుతోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మహిళల గుండె ఎందుకు బలహీనపడుతోంది?
పురుషులతో పోలిస్తే, మహిళలకు గుండె జబ్బులు కాస్త ఆలస్యంగా అంటే పెద్ద వయసులో వస్తాయి. అయితే సమస్య వచ్చినప్పుడు అది మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే వారి శరీరంలో షుగర్, అధిక రక్తపోటు వంటి అనేక ఇతర సమస్యలు తిష్టవేసి ఉంటాయి. ముఖ్యంగా స్మోకింగ్, షుగర్, యుక్తవయసులోనే రుతువిరతి రావడం వంటివి స్త్రీ శరీరానికి సహజంగా ఉండే రక్షణ కవచాలను ఛిద్రం చేస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వేగంగా ముదిరి ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి.

మహిళలకే ప్రత్యేకం.. ఈ ప్రమాదాలు
పురుషులలో కనిపించని కేవలం స్త్రీలకే ప్రత్యేకమైన కొన్ని శారీరక మార్పులు, సమస్యలు వారి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
రుతువిరతి (మెనోపాజ్): ఈ దశలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ హార్మోన్ గుండెకు రక్షణగా నిలుస్తుంది. అది తగ్గడంతో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
గర్భధారణ సమస్యలు: గర్భంతో ఉన్నప్పుడు హై బీపీ, ప్రెగ్నెన్సీ డయాబెటిస్ వంటి సమస్యలు ఎదుర్కొన్న వారికి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.
PCOS, రక్తహీనత: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), రక్తహీనత వంటివి కూడా గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు: రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధులు ఉన్న మహిళల్లో గుండె జబ్బుల ముప్పు చాలా రెట్లు అధికం.
మధుమేహం,ధూమపానం.. రెట్టింపు ప్రమాదం
మధుమేహం ఉన్న మహిళలకు, పురుషులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏకంగా ఏడు రెట్లు ఎక్కువ. అలాగే ధూమపానం స్త్రీ శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావాన్ని నాశనం చేసి, గుండెపోటును త్వరగా, మరింత తీవ్రంగా వచ్చేలా చేస్తుంది.
మానసిక ఒత్తిడి
బిజీగా మారుతున్న లైఫ్, పెరిగిపోతున్న ఒంటరితనం, ఉద్యోగినులపై పని భారం వారిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. ఈ మానసిక వేదనే నేడు మహిళల్లో గుండె జబ్బులకు అతిపెద్ద కారణంగా మారుతోంది. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. కాబట్టి, మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడిని జయించడం, క్రమం తప్పని వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications