Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
గుండెలో విషం నింపే ఆహారాలివే..వెంటనే ఇవి తినడం ఆపేయండి
గుండె అనేది మానవ శరీరములో అతి ముఖ్యమైన అవయవం. అది బాగా పనిచేయటానికి మనం ఎంతో జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు గుండె జబ్బులు అంటే పెద్ద వయస్సు వారికే వస్తాయి అని అనుకునేటోళ్లు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ప్రాణాంతకమైన గుండె జబ్బులు వస్తున్నాయి. నడుస్తున్నోళ్లు నడుస్తూనే ఒక్కసారిగా కూలిపోయి హార్ట్ ఎటాక్ తో చనిపోవడం, అన్నం తింటూ కూడా కుప్పకూలి గుండెపోటుతో మరణించడం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి మన గుండెను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
గుండె ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు మీ ఆహార ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ గుండె ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి. గుండెకు కీడు చేసే ఆ ఆహార పదార్థాలు ఏవో ఇక్కడ చూడండి.
గమనించవలసిన విషయం
మీరు ప్రతిరోజూ అల్పాహారంలో వెన్నతో బ్రెడ్ కూడా తింటున్నారా?అయితే, ఈ రెండు మీ గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బ్రెడ్-బటర్ వంటి ఆహార కలయికలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది మాత్రమే కాకుండా ఎక్కువ ఎర్ర మాంసం(red meat) తీసుకుంటే మీరు బాధపడాల్సి రావచ్చు.

ప్యాక్ చేసిన సూప్
రెస్టారెంట్లలోనూ లేదా ఇతర చోట్ల ప్యాక్ చేయబడిన సూప్ లలో MSG (మోనోసోడియం గ్లుటామాటే) అనే పదార్ధాన్ని కలిగి ఉండటంవల్ల అది గుండెకు పూర్తిగా చెడ్డది. ఈ సూప్లలో మీ ధమనులను దెబ్బతీసే సోడియాన్ని కలిగి ఉంటాయి తద్వారా అది గుండెపోటుకు దారితీస్తుంది. వాటికి బదులుగా మీ ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకునే సూపు మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
హానికరమైన చక్కెర పానీయాలు
కొంతమందికి చక్కెర పానీయాలు అంటే చాలా ఇష్టం, దాదాపు ప్రతిరోజు వాటిని తీసుకుంటారు. మీరు కూడా క్రమం తప్పకుండా చక్కెర పానీయాలు తీసుకుంటుంటే, మీ ఈ అజాగ్రత్త మీ గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అదనపు చక్కెరతో పాటు అదనపు సోడియం కూడా గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మీరు మీ గుండె ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవాలనుకుంటే వీటిని పరిమితుల్లో తీసుకోండి.
బ్లెండెడ్ కాఫీ
ప్రసిద్ధమైన కాఫీ షాపుల్లో లభించే బ్లెండెడ్ కాఫీలు మీ గుండెకు చాలా అనారోగ్యకరమైనవి. బ్లెండెడ్ కాఫీలు సిరప్, షుగరు, క్రీమ్, ఇతర టాపింగ్స్ తో కూడిన పదార్ధాలు కేలరీలను, కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అధికం చేసి షుగర్, గుండె జబ్బులకు దారితీస్తుంది.
సాసేజ్లు
ఈ చిన్న చిన్న మాంసం ముక్కలు మీ హృదయ ధమనులను నాశనం చేయగలదు. ఎక్కువమంది తినే ఈ సాసేజ్లులో సంతృప్త కొవ్వు, సోడియం అధిక మొత్తంలో ఉంటాయి. సంతృప్త కొవ్వు, సోడియం, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న కొన్ని ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బులకు,గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి
జంక్ ఫుడ్ తినే అలవాటు మీ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యానికి కూడా హానికరం. ఆరోగ్య నిపుణులు తరచుగా డైట్ ప్లాన్ నుండి జంక్ ఫుడ్స్‌ను మినహాయించాలని సిఫార్సు చేయడానికి ఇదే కారణం. బర్గర్లు, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్ తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే హానికరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications