Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
ఎక్కువగా నిద్రపోతే..త్వరగా మరణిస్తారు..! పరిశోధనలో షాకింగ్ విషాయలు..!
నిద్ర సుఖమెరుగదని ఒక పాత సామెతు వుంది. అవును అది అక్షరాలా నిజం. కొందరికి నిద్ర వుంటే చాలా ఇకేమి అవసరం లేదన్నట్టు వుంటారు. కంటినిండా నిద్రవుంటే చాలా వారికి తినడానికి ఆహారం కూడా వద్దంటారు. కానీ వారి నిద్రకూడా చాలా అతిగా వుంటుంది. రోజుకు 12 గంటల నుంచి 15 గంటల వరకు నిద్రపోతారు. ఎక్కువ సేపు నిద్రపోవడం కూడా అనారోగ్యానికి ఒక కారణమని ప్రముఖ వైద్యులు చెెబుతున్నారు. రోజుకు 10 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే దాని అతినిద్రగా పరిగణించాలని సూచిస్తున్నారు.
నిద్రపట్టక చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీన్ని నిద్రలేమి సమస్యగా, ఇన్‌సోమ్నియా వ్యాధిగా గుర్తిస్తాం. ఎక్కువ నిద్రపోవడం కూడా అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. వయసును బట్టి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో నిపుణులు ఒక ప్రత్యేక చార్ట్‌ను రెడీ చేసశారు. వయసు పెరిగే కొద్ది నిద్రించే సమయం తగ్గుతుంది. మూడు నెలల వయసున్న పసికందులు రోజుకు కనీసం 17 గంటల వరకు నిద్రపోవాలి. ఇక 4 నుంచి 11 నెలల వయసున్న పిల్లలు రోజుకు 15 గంటలు నిద్రపోవాలి. ఒకట నుంచి 2 సంవత్సరాల వయసున్న పిల్లలు రోజుకు 14 గంటలు నిద్రించాలి. 3 నంచి 5 గంటల వరకు వయసున్న పిల్లలు రోజుకు 13 గంటలు నిద్రపోవాలి. 6 నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లలు రోజుకు కనీసం 11 గంటలు నిద్రించాలి. 17 ఏళ్ల వయసున్న పిల్లలు రోజుకు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి.
ఎక్కువగా నిద్రించేవారు హైపర్‌సోమ్నియాతో బాధపడుతున్నట్టేనని వైద్యులు అంటున్నారు. డిప్రెషన్ ఎక్కువగా వుంటే కూడా ఎక్కువగా నిద్రపోతారని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్‌ల వల్ల నిద్ర ఎక్కువగా వస్తుందని అంటున్నారు.
ఎక్కువగా నిద్రపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. మనిషిలో ఆందోళని కూడా పెంచుతుంది. ఎక్కువగా నిద్రపోతే బరువు పెరగడం, స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వచ్చే అవకాశముంది.
కొన్ని సహజపద్ధతుల ద్వారా ఈ హైపర్‌సోమ్నియా వ్యాధి నుంచి క్రమంగా బయటపడొచ్చు. నిద్రపోవడానికి ఒక ప్రత్యేకమైన టైంటేబుల్‌ను రెడీ చేసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిశాల పాటు వ్యాయామం చేయాలి. నిద్రించే ముదు ఫోను ఎక్కువగా వాడవద్దు. పడుకునే ముందు మద్యం తాగడం, కాఫీ,టీ తాగడం, భోజనం చేయరాద.
నిద్రకు సంబంధించి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు ఒక పరిశోధన చేశారు. రోజుకు 4 గంటల కంటే తక్కువగా నిద్రపోయేవారు 6 సంవత్సరాల్లోనే మరణించారని, ఇదే పరిస్థితి 9 గంటలకంటే ఎక్కువ నిద్రించే వారిలో కూడా వుందని బయటపెట్టారు. దీంతో ఈ పరిశోధన మనకు చెబుతున్న విషయమేమంటే శరీరానికి అతి తక్కువగా నిద్రపోయినా లేదా ఎక్కువగా నిద్రపోయినా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన చెబుతోంది.
ఎక్కువగా నిద్రిస్తే ఈ ఆనారోగ్యాల బారిన పడాల్సివస్తుంది
ఎక్కువగా నిద్రిస్తే టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశముంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశముంది. ఎక్కువగా నిద్రించడం వల్ల అధిక బరువు, డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయ్. తలనొప్పి కూడా తీవ్రమౌతుంది. చికిత్స పొందుతూ మరణించే అవకాశం కూడా చాలా ఎక్కువగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











