Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వీటిని డయాబెటిక్ పేషంట్లు తినకూడదు..? డ్రై ఫ్రూట్స్ ప్రమాదం..!
మధుమేహం లేదా డయాబెటీస్ ఉన్నవారు ప్రత్యేక డైట్‌ని పాటించాల్సిన అవసరం వుంది. పోషకాలు ఎక్కువగా వున్నా కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవద్దు. డైట్ తప్పితే ప్రాణాలకే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం వుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. శరీరంపై ఆహారం తీవ్రప్రభావం చూపిస్తుంది. ఆహారం విషయంలో డయాబెటిక్ పేషంట్లు ఆచితూచి తినాల్సిన పరిస్థితి నెలకొని వుంది. లేదంటే షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగి ఆరోగ్య పరిస్థితి చేయిదాటే అవకాశం వుంది.
డయాబెటిక్ పేషంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవద్దో మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఇస్తున్న విషయాాలు డైట్ ఇంటర్నెట్‌లో ప్రముఖ వైద్యులు సూచించినవేనని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము.
కార్బోహైడ్రేట్లు
బియ్యం, గోదుమ, బ్రెడ్, పాస్తా లాంటి వాటిని మార్కెట్లోకి వచ్చే ముందు వాటిని శుద్ధి చేస్తారు. ఒక ప్రక్రియ ద్వారా వాటిలో వున్న కొంత శాతం కార్బోహైడ్రేట్లు తొలగించబడతాయ్. ఈ ప్రక్రియలో అలాంటి బియ్యం, గోదుమల్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి అవి తినడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి పెరిగే అవకాశం వుంది. కాబట్టి రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లకు సంబంధించిన వాటిని ఆహారంలో భాగం చేసుకోకూడదు. బ్రౌన్ రైస్, ఓట్స, చెక్కెర స్థాయి తక్కువగా వున్న ధాన్యాలను మాత్రమే తీసుకోవాలి.
చెడు కొలెస్ట్రాల్
ఫాస్ట్ ఫుడ్, బయట బేకరీ ఫుడ్, ఫ్రై చేసిన మాంసం లాంటి ఆహార పదార్ధాల్లో చెడు కొలెస్ట్రాల్ అధికంగా వుంటుంది. వీటిలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ డయాబెటిక్ తో బాధపడుతున్న వారికి చాలా ప్రమాదకరం. తరచూ ఇవి తినడం వల్ల వారు గుండెపోటుకు కూడా గురయ్యే అకవాశాలు ఎక్కువగా వుంటాయ్. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలో చేరకుండా ఉండాలంటే ముఖ్యంగా జంక్ ఫుడ్, బయట ఫ్రై చేసిన వాటికి దూరంగా వుండాలి.

డ్రై ఫ్రేట్స్
డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలతో పాటు కార్బొహైడ్రేట్లు, షుగర్ స్థాయి అధికంగా వుంటుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్‌ను కూడా డయాబెటిక్ పేషంట్లు తినకూడదు. ఎన్ని పోషకాలు మెండుగా వున్నా కూడా అలాంటి కొన్ని ఆహార పదార్ధాలను తినకుండా వుండడమే డయాబెటిక్ పేషంట్లకు ఆరోగ్యకరమన్న సత్యాన్ని గుర్తించాలి.
చిరుతిళ్లు
చిప్స్, బర్గర్, కేకులు, బిస్కెట్లు, వీటిల్లో చెక్కర శాతం ఎక్కువంటదన్న విషయం మనకు తెలిసిందే. కొన్నింటిలో చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా వుంటుంది. ఈ విషయాన్ని ప్యాక్ చేసిన ఆ చిరుతిండి కవర్ పైన కూడా వుంటుంది. చిరుతిళ్లను పూర్తిగా తినకుండా ఉండడమే డయాబెటిక్ పేషెంట్లక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
పాల పదార్ధాలు
పాల పదార్ధాల్లో క్యాల్షియం, ప్రొటీన్లు, వైటమిన్లు ఎక్కువగా వున్నప్పటికీ వాటిలో వుండే ల్యాక్టోస్‌కు చెక్కర లక్షణాలున్నాయ్. శరీరంలో చెక్కర స్థాయిని ల్యాక్టోస్ అమాంతంగా పెంచుతుంది. అందువల్ల పాల పదార్ధాలకు డయాబెటిక్ పేషంట్లు దూరంగానే వుండాలి.
కూరగాయలు
డయాబెటిక్ పేషంట్లు కేవలం కొన్ని రకాల కూరగాయలను మాత్రమే తినాలి. ఆలుగడ్డ, బీట్‌రూట్ లాంటి కూరగాయల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా వుంటాయ్. దీంతో ఇవి చెక్కర స్థాయిని పెంచే అవకాశం వుంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్లు ఎక్కువగా వున్న ఆలుగడ్డ, బీట్‌రూట్ లాంటి ఇతర కూరగాయలను తీసుకోద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications