Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
Guava: కట్ చేయకుండానే జామకాయ మంచిదో కాదో ఇలా తెలుసుకోండి..ఎరుపు,తెలుపు మధ్య తేడా ఇదే
చలికాలంలో ఎక్కువగా లభించే జామపండుని(Guava) పేదవాడి యాపిల్ అని అంటుంటారు. మంచి దోర జామకాయను కోసి ఉప్పు కారం పెట్టుకుని తింటుంటే నోటికి పండగే. జామపండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అయితే జామపండును కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తరచుగా ఓ సమస్యను ఎదుర్కొంటారు. అదేంటంటే కొన్ని జామకాయలు ప్రెష్ గా కనిపిస్తాయి కానీ వాటిని కొని ఇంటికి తీసుకెళ్లి తిందామని కట్ చేస్తే లోపల పురుగులు లేదా కీటకాలు ఉంటుంటాయి.
చాలామందికి ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటది. ఇలాంటి జామ కాయ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఓ ట్రిక్ ద్వారా జామపండును కోయకుండానే అసలు అందులో పురుగులు ఉన్నాయా లేదా అది తియ్యనైనాదా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు.

కీటకాలు సోకిన జామను గుర్తించడం ఇలా
మార్కెట్ లేదా రోడ్డు పక్కన జామ కాయలను కొనే ముందు కాయ ఉపరితలాన్ని జాగ్రత్తగా చెక్ చేయాలి. జామకాయ ఉపరితలంపై ఏవైనా చిన్న రంధ్రాలు,రహదారి గుర్తులు లేదా అసమాన రంగులు కనిపిస్తే ఆ జామ లోపల క్రిములు ఉండవచ్చని అర్థం చేసుకోవచ్చు. కీటకాల వల్ల జామ రంగు ఇలా మారుతుంది.
జామపండును నొక్కండి
జామపండును కొనే ముందు అరచేతితో తేలికగా నొక్కాలి. జామను నొక్కినప్పుడు చాలా మెత్తగా అనిపిస్తే దానిని తీసుకోకపోవడం బెటర్. జామ చాలా గట్టిగా లేదా మెత్తగా ఉండకూడదు. చాలా గట్టి జామపండ్లు పండనివి కావచ్చు..కానీ చాలా మెత్తగా ఉండే జామపండ్లు పురుగులను కలిగి ఉండవచ్చు.
వాసన ద్వారా
ప్రెష్ జామపండ్ల వాసన తీపిగా ఉంటుంది. కీటకాలు ఉన్న జామపండ్లు వింత వాసన కలిగి ఉండవచ్చు. అటువంటి జామపండ్లను కట్ చేసినప్పుడు వాటిలో చిన్న చిన్న కీటకాలు లేదా నల్ల మచ్చలు కనిపిస్తాయి. జామపండ్లను కొనే ముందు వాటి వాసన చూడటం మర్చిపోవద్దు.
రంగు, పైతొక్కను చెక్ చేయండి
జామకాయ కొనే ముందు దాని పై తొక్క,రంగును చెక్ చేయండి. జామ తొక్క నునుపైన,కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా, దాని పరిమాణానికి బరువుగా ఉంటే బాగుంటుంది. రంగు విషయానికొస్తే రుచికరమైన జామపండు కావాలంటే పసుపు రంగు జామను కొనుగోలు చేయాలి. కొద్దిగా పులుపు నచ్చితే పచ్చి జామపండు కూడా కొనుక్కోవచ్చు. మొత్తం పసుపు జామ కొనడం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి ఈసారి జామకాయ కొనడానికి వెళ్లినప్పుడు ఈ టిప్స్ ద్వారా చూసుకొని కొని ఆస్వాదించండి.
తెలుపు,ఎరుపు రంగుల జామ మధ్య తేడా
మార్కెట్ లో లేదా చెట్ల మీద ఎరుపు,తెలుపు అనే రెండు రకాల జామపండ్లను తరచుగా చూస్తుంటాం. జామ ఎరుపు రంగు లైకోపీన్ అనే వర్ణద్రవ్యం వల్ల వస్తుంది,ఇది ఒక రకమైన కెరోటినాయిడ్. లైకోపీన్ అనేది జామ పండుపై తొక్క, గుజ్జులో కనిపించే సహజ రంగు. అదే సమయంలో తెల్ల జామలో లైకోపీన్ లేకపోవడం వల్ల పండు రంగు తెల్లగా మారుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications