Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మలబద్ధకం నరకం చూపిస్తోందా? మీ జీర్ణవ్యవస్థను జెట్ స్పీడ్ తో పరుగెత్తించే సూపర్ ఫ్రూట్స్ ఇవే!
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరకనే అనలేదు. మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే కేవలం పోషకమైన ఆహారం తీసుకుంటే సరిపోదు, మన జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయాలి. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై, శరీరంలోని వ్యర్థాలు ప్రతిరోజూ సాఫీగా బయటకు వెళ్ళినప్పుడే మనం రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండగలం.
అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఇది వినడానికి చిన్న సమస్యలా అనిపించినా, అనుభవించేవారికి మాత్రం నరకం చూపిస్తుంది. ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. దీనిని నిర్లక్ష్యం చేస్తే, ఇది పైల్స్ వంటి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచించారు. మన రోజువారీ అల్పాహారంలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే పండ్లను చేర్చుకోవడం ద్వారా పేగుల కదలికలను మెరుగుపరుచుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వడానికి, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ జోసెఫ్ సూచించిన ఆ 5 సూపర్ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కివి పండు
మలబద్ధకానికి కివి పండు ఒక అద్భుత ఔషధం. ఇందులో విటమిన్ సి, ఫైబర్,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం రెండు కివి పండ్లు తినడం వల్ల ప్రేగు కదలికలు సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మలాన్ని మృదువుగా మార్చి, విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
పసుపు డ్రాగన్ ఫ్రూట్
సాధారణ గులాబీ రంగు డ్రాగన్ ఫ్రూట్ కంటే, పసుపు రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్ రుచిలో తియ్యగా ఉండటమే కాకుండా జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం సగం పసుపు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి. ఇది సహజ సిద్ధంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో నీటి శాతం, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతూ, మలం గట్టిపడకుండా చూస్తాయి. మీ అల్పాహారంలో ఓ గుప్పెడు బెర్రీలను చేర్చుకోవడం వల్ల గొప్ప ఫలితాలను చూడవచ్చు.
ఆపిల్
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు అన్నది అక్షరాలా నిజం. ఆపిల్ పండులో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. ప్రేగు కదలికలను ప్రేరేపించి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తుంది.
బేరి పండు
మలబద్ధకం మరీ ఇబ్బంది పెడుతుంటే బేరి పండు తినడం మంచిది. ఇందులో సార్బిటాల్ అనే సహజ చక్కెర ఆల్కహాల్ ఉంటుంది. ఇది పేగులలోకి నీటిని లాగి, మలాన్ని మెత్తబరుస్తుంది. తద్వారా ఇది ఒక సహజ విరేచనకారిలా పనిచేసి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications