Latest Updates
-
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే..
ఉగాది పచ్చడితో ఆ రోగాలన్నింటినికి చెక్..ఈ లాభాలు మీకు తెలుసా
తెలగు లోగిళ్లలో ఇవాళ(మార్చి 30)ఉదయం నుంచే ఉగాది సందడి మొదలైంది. ఉగాది పండుగ వచ్చిందంటే తెలుగిళ్లల్లో తప్పకుండా ఓ పచ్చడిని స్పెషల్ గా తయారుచేస్తుంటారు. దీనినే ఉగాది పచ్చడి అంటారు. అప్పుడే వేపచెట్టుకు వచ్చే పూత, అప్పుడప్పుడే మామిడిచెట్టుకు కాసే పిందెలతో కలిపి తయారుచేసే ఉగాది పచ్చడి చాలా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా పిలుస్తారు. ఉగాది పచ్చిడిలో కారం,వగరు, పులుపు,తీపి, ఉప్పు,చేదు అనే ఆరు రుచులు జవితంలోని ఆరు భిన్నమైన అనుభవాలకు చిహ్నం.
ఉగాది పచ్చడి తయారీకి వేప పువ్వు(చేదు),మామిడికాయ పిందెలు(వగరు), బెల్లం (తీపి),మిరియాల పొడి లేదా పచ్చిమిర్చి (కారం), చింతపండు (పులుపు), ఉప్పు, ప్రధాన పదార్థాలుగా ఉపయోగిస్తారు. సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, విసుగు అనే ఆరు భావాలను ఈ పచ్చడి సూచిస్తుంది. ఉగాది పచ్చడి కేవలం ఒక సాంప్రదాయ వంటకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుగ సందర్భంగా దీనిని తీసుకోవడం వల్ల శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఉగాది పచ్చడి తినడం వల్ల మీ శరీరానికి జరిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉగాది పచ్చడితో లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఉగాది పచ్చడి తయారీలో వాడే చింతపండు, మామిడికాయ వంటి పుల్లని పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి..తద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది
ఆయుర్వేదం ప్రకారం ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు (తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు) శరీరంలోని మూడు దోషాలైన వాత, పిత్త, కఫలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ప్రతి రుచి శరీరానికి ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
డీహైడ్రేషన్ నివారిస్తుంది
వేసవి కాలం ప్రారంభంలో ఉగాది వస్తుంది. ఉగాది పచ్చడి తయారీలో వాడే బెల్లం, మామిడిలో ఉండే పోషకాలు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి.
రక్త శుద్ధికి సహాయపడుతుంది
ఉగాది పచ్చడి తయారీలో వాడే వేపపువ్వు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే వేపపువ్వులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరకమైన క్రిములతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పచ్చడి తయారీలో వాడే మామిడి పిందెలోని విటమిన్ సి కూడా రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
శరీరానికి శక్తినిస్తుంది
బెల్లం ఉగాది పచ్చడిలో వాడే ముఖ్యమైన తీపి పదార్థం. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది, శరీరంలోని అలసటను తగ్గిస్తుంది. సహజమైన చక్కెరలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యకరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
ఉగాది పచ్చడిలోని వివిధ రుచులు జీవితంలోని భిన్నమైన అనుభవాలను సూచిస్తాయి. వీటిని స్వీకరించడం ద్వారా మానసిక స్థిరత్వం, సానుకూల దృక్పథం పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications