Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
జిమ్ వద్దు,డైటింగ్ వద్దు..ఈ జపాన్ టెక్నిక్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు!
ఈ రోజుల్లో ఏది పడితే అది ఎప్పడు పడితే అప్పుడు తినడం,సరైన నిద్ర లేకుండా పోవడం,గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు పెరిగిన తర్వాత దాన్ని తగ్గించడానికి నానా అవస్థలు పడుతుంటారు. కొందరు అయితే లైట్ తీసుకొని వదిలేస్తారు..ఫలితంగా కొద్దిరోజులుకు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరికొందరు అయితే బరువు తగ్గాలని కఠినమైన డైట్ లు, ఎక్సర్ సైజులు చేస్తుంటారు.బరువు తగ్గడానికి ఎన్నో డైట్ ప్లాన్‌లు, కఠినమైన వ్యాయామాలు ప్రయత్నించి విసిగిపోయారా? అయితే జిమ్ కు వెళ్లే సమయం లేకపోయినా, ఒత్తిడి లేకుండా నాజూగ్గా మారాలనుకునేవారికి జపనీయుల జీవనశైలి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. జపానోళ్ల ఫిట్ నెస్ రహస్యాలు కఠినమైనవి కావు, చాలా సులభమైనవిగా ఉంటాయి.
80 శాతం సూత్రం పాటించండి
జపనీయులు అనుసరించే ఒక అద్భుతమైన సూత్రం ఇది. వారు భోజనం చేసేటప్పుడు కడుపు పూర్తిగా నిండే వరకు తినరు. కేవలం 80 శాతం కడుపు నిండినట్లు అనిపించిన వెంటనే తినడం ఆపేస్తారు. ఈ చిన్న మార్పు వల్ల అతిగా తినడాన్ని నివారించవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన కేలరీలు మాత్రమే అందుతాయి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఫలితంగా కొవ్వు పేరుకుపోయే అవకాశమే ఉండదు.

చిన్న పాత్రలు, నెమ్మదైన భోజనం
జపనీయులు తినడానికి ఎప్పుడూ చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్లను వాడతారు. ఇది పోర్షన్ కంట్రోల్ కు సహజంగా సహాయపడుతుంది. అంతేకాకుండా వారు ఆహారాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తింటారు. దీనివల్ల మెదడుకు కడుపు నిండింది అనే సంకేతం అందడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఈ అలవాటు మనల్ని తక్కువ ఆహారంతోనే సంతృప్తిగా ఉండేలా చేస్తుంది.
గ్రీన్ టీ ఒక సంప్రదాయం
జపాన్‌లో భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం వారి సంస్కృతిలో భాగం. గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రోజూ 2-3 కప్పుల చక్కెర లేని గ్రీన్ టీ తాగడం వల్ల బరువు నియంత్రణలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
పులియబెట్టిన ఆహారాల మేజిక్
జపనీయుల ఆహారంలో మిసో సూప్ వంటి పులియబెట్టిన పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఆహారాలలో ప్రోబయోటిక్స్ లేదా మంచి బ్యాక్టీరియా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ బరువు తగ్గడానికి పునాది లాంటిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
